మరో సరికొత్త జబ్బు – దీనికి ఇంకా ఔషధం లేదు గురూ

ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన డిసీజ్. దీని ద్వారా పందులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ వ్యాధి పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. మిజోరంలో పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. 2 నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర రైతులకు దాదాపు రూ. 19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ జేడీ తెలిపారు. మార్చి 21న లంగ్‌లై జిల్లా లంగ్‌సేన్‌ గ్రామంలో ఈ వ్యాధి బయటపడగా అనంతరం 9 జిల్లాలకు వ్యాపించినట్లు చెప్పారు. వీటి పరిధిలోని 91 గ్రామాలను స్వైన్‌ ఫీవర్‌ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు.

pig articles diseases swine vet

అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మోహరించారు. లంగ్​సెన్​ను ఇన్​ఫెక్టెడ్ జోన్​గా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అనౌన్స్ చేసింది. ఆ జిల్లాలోని 26 గ్రామాల్లో ఈ కేసులు న‌మోద‌య్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం 32 వేల పందులున్నట్లు జేడీ తెలిపారు. ఏఎస్‌ఎఫ్‌ ప్రబలని ప్రాంతాల్లోనూ 100 వరకు పందులు చనిపోయాయి. మిజోరంలో ఇలాంటి వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి కాగా పందులను పొరుగు రాష్ట్రాలు, దేశాలనుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యాధితో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని, పందుల నుంచి ఇది మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇన్​ఫెక్టెడ్ జోన్ వెలుపల పందులు అనుమానాస్పద రీతిలో మరణించినట్లు తెలిసిందని గ‌వ‌ర్న‌మెంట్ తెలిపింది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల స్వైన్ ఫీవర్ వ్యాపించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.