వర్క్ ఫ్రం హోం కి బాయ్ బాయ్ అంటున్న కంపెనీలు!

కరోనా మహమ్మారి కారణంతో ప్రారంభమైన కొత్త సంస్కృతి ఇంటినుంచి పని చేయడం (వర్క్ ఫ్రం హోం). కరోనా ప్రభావంతో చాలా మంది ఇంటి నుంచే తమ కార్యాకలాపాలను కొనసాగించారు. అయితే ఈ విధానం త్వరలో ముగుస్తుంది. చాలా సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, ఎకానమీ పుంజుకోవడం, వ్యాక్సినేషన్‌‌‌‌, కరోనా ఆంక్షలు ఎక్కువగా లేవు కాబట్టి కంపెనీలు వర్క్‌‌‌‌ ఫ్రం హోం విధానాన్ని ఆపేస్తున్నాయి. అంతే కాదు టాప్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ మెంబర్లకు, రీజనల్‌‌‌‌ హెడ్స్‌‌‌‌కు కూడా మినహాయింపులు ఇవ్వడం లేదు. గర్భిణులు, ఏడాదిలోపు పిల్లలు ఉన్న మహిళలు, 65 ఏళ్లు పైబడిన వాళ్లు, తీవ్రమైన జబ్బులు ఉన్న వాళ్లకు, కంటైన్‌‌‌‌మెంట్ జోన్లవాసులకు మాత్రం వర్క్‌‌‌‌ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నామని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి.

coae minఇక టీసీఎస్ ఉద్యోగుల్లో అధిక భాగం టీకాలు వేయించడం పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. నవంబరు నాటికి వందశాతం మంది ఎంప్లాయిస్‌‌‌‌ ఆఫీసులకు వస్తారని చెప్పారు. బ్రాంచ్‌‌‌‌లు, కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ ఆఫీసుల్లో వర్క్‌‌‌‌ ఫ్రం హోంను రద్దు చేశామని అన్నారు. . దాదాపు 18 నెలల తర్వాత, ప్రజల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు 360 డిగ్రీల మలుపు తిరిగినప్పటి నుండి, జీవితం సాధారణ స్థితికి చేరుకున్నట్లు అనిపిస్తుంది. ఇక 2020 లో, 96 శాతం టిసిఎస్ సిబ్బంది రిమోట్ వర్కింగ్‌కు మారారు. అయితే కొవిడ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం ఆఫీసులను నడిపిస్తున్నామని, పరిశుభ్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్‌‌‌‌ ఇస్తున్నామని చాలా కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వ్యాక్సినేషన్‌‌‌‌ను పూర్తిచేశాయి. కాకపోతే ఎంప్లాయిస్‌‌‌‌లో ఎక్కువ మంది వర్క్‌‌‌‌ ఫ్రం హోంకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కరోనా కట్టడి కాలేదు.. ఒకవేళ కరోనా భారిన పడితే కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతున్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

workg min 1ఇదిలా ఉంటే కరోనా థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ రాదని గ్యారంటీ ఏమీ లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికీ కొన్ని కంపెనీలు దైలమాలో ఉన్నాయి. ఎంప్లాయిస్‌‌‌‌కు పూర్తిస్థాయి భద్రత కల్పించగలమా అన్న అనుమానాలూ ఉన్నాయి. కరోనా విషయంలో ఉద్యోగస్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించగలమా అన్న డైలమాలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ విషయం గురించి డెలాయిట్‌‌‌‌ ఇండియా ట్యాలెంట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఎస్‌‌‌‌.వి.నాథన్‌‌‌‌ మాట్లాడుతూ ఎక్కువ మంది ఎంప్లాయిస్ హైబ్రిడ్‌‌‌‌ మోడల్‌‌‌‌ను ఇష్టపడుతున్నారని చెప్పారు. వసరమైనప్పుడు ఆఫీసుకు వస్తూ మిగతా రోజుల్లో వర్క్‌‌‌‌ ఫ్రం హోం చేయడాన్ని హైబ్రిడ్‌‌‌‌ మోడల్‌‌‌‌గా పిలుస్తున్నారు.

wroge minవ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న ఎంప్లాయిస్‌‌‌‌లను మాత్రమే ఆఫీసుకు రమ్మన్నామని, మిగతా వారికి అక్టోబరు 31 దాకా వర్క్‌‌‌‌ ఫ్రం హోం ఉంటుందని విప్రో తెలిపింది. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ట్యాక్‌‌‌‌ సెక్యూరిటీ ఇండియా తన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది.. మిగతా రోజులు ఉద్యోగులకు తగినంత విశ్రాంతి ఉంటుంది కనుక వారు మరింత ఉత్సాహంగా పని చేయగలరని.. ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ పెరుగుతుందని కంపెనీ తెలిపింది.ఉద్యోగుల్లో చాలా మంది కొత్త విషయాలను నేర్చుకుంటున్నారని, కొందరు కొత్త కోర్సుల్లో చేరారని కంపెనీ సీఈఓ తృష్ణీత్‌‌‌‌ అరోరా అన్నారు.