త్వరపడండి.. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఫ్రీగా మంచి నూనె ప్యాకెట్‌

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా కొన్ని చోట్లో జనాలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్‌ తీసుకుంటే ఏమన్న అవుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. అలాంటి వారి భయం పొగొట్టి, వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒక వినూత్న ఆలోచన చేశారు.

Phones are free for those who have been vaccinated - Suman TVమురికివాడల్లో కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం స్లోగా జరుగుతున్నట్లు గ్రహించి అక్కడ మొదటి డోసు వ్యాక్సినేషనులో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను టీకా తీసుకున్నవారికి వంటనూనె ప్యాకెట్లు అందిస్తున్నారు. లక్కీడ్రా పెట్టి రూ.10 వేల విలువ చేసే ఫోన్లు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా శనివారం పది వేల వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేయగా.. ఆదివారం నాటికి ఆ సంఖ్య 20 వేలకు చేరింది. లక్కీ డ్రాలో 25 మంది ఫోన్లు గెలుచుకున్నట్లు ఏఎంసీ అధికారి తెలిపారు. ఈ ప్రయత్నంలో యువ అన్‌స్టాపబుల్‌ ఆర్గనైజేషన్‌ తమకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.