కల్యాణమండపంలో వధూవరుల కబడ్డీ… గెలిచిందెవరూ!?.

Bride Starts Playing 'Kabaddi' On Stage - Suman TV

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన ఘ‌ట్టం. ఆ రోజు జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను ఎంతో ప‌దిలంగా త‌మ జ్ఞాప‌కాల‌లో దాచుకుంటారు. ఇటీవ‌ల కాలంలో   త‌మ వివాహాల‌లో ఏదో ప్ర‌త్యేకంగా ఉండాల‌ని బావిస్తున్నారు.  డిఫరెంట్ గా  కొత్త కొత్త ప‌ద్దతుల‌ను ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి బాగానే ఉన్నా చాలా సార్లు మాత్రం ఫ‌న్నీగా ఉంటున్నారు.  ఏమైన‌ప్ప‌టికీ వారు చేసే ప‌నులు మాత్రం సోష‌ల్ మీడియాలో చాలా వైర‌ల్ గా మారాయి. ఈ నేపధ్యంలో ఓ పెళ్లి వేడుకలో వధూవరుల కబడ్డీ ఆటాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Bride Playing Kabaddi minపెళ్లి వేడుకలో వధూవరుల దండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. వధువరులు వర మాలల మార్చుకోవాలి. ఈ సందర్భంగా ఓ మహిళ వధువు చెవిలో ఏదో చెప్పి వెళ్లింది. ఆ తర్వాత వధువు తన చేతిలో మాలను వరుడి మెడలో వేసింది. ఇప్పుడు పెళ్లి కొడుకు వంతు వచ్చింది. అతడు వధువు మెడలో వరమాల వేయడానికి సిద్ధమయ్యాడు. వధువు మాల వేయించుకోకుండా తప్పించుకుంది. ఆ తర్వాత అటూ ఇటూ పరుగులు పెట్టింది. అలా వేదిక మొత్తం పరుగులు పెడుతూ వరుడితో కబాడ్డీ ఆడింది. దీంతో వరుడికి చుక్కలు కనిపించాయి.

పెళ్లి వేదికపై పరుగెత్తుతూ పెళ్లి కొడుకుకి పట్టుకోమన్నట్లు సవాలు విసిరింది. కొంతసేపు ఇద్దరూ పరుగుపందెం ఆట ఆడారు. ఇక వరుడికి బంధువులు కొంత సహాయం చేయడంతో వధువు మెడలో వరుడు దండ వేశాడు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘జాగ్ర‌త్త బ్ర‌ద‌ర్  ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు చాలా ఆట‌లు ఆడాల్సి వ‌స్తుంద‌’ని ఒక‌రు కామెంట్ చేయగా ‘వ‌ధువుకు గేమ్స్ అంటే ఇష్టం ఉన్న‌ట్లుగా ఉందం’టూ మ‌రొక‌రు కామెంట్ చేశారు.

ఈ ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీశ్‌ మిశ్రా అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగ వైరలవుతోంది. ఆ వీడియోని మీరూ చూడండి.