ప్రధాని మోదీ ఫోటోను తీసేయండి.. సుప్రీం కోర్టు ఆదేశం

Supreme Court should remove Modi's photo Suman TV

అపెక్స్‌ కోర్టు పంపించే అఫీషియల్‌ ఈమెయిల్స్‌ చివరల్లో మోదీ ఫోటో, ‘సబ్‌కా సాత్‌, సాత్‌.. సబ్‌కా వికాస్‌’నినాదం ఫూటర్‌ ఇమేజ్‌గా ఉండడం వివాదస్పదమైంది. ఈ విషయం సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లింది. న్యాయవ్యవస్థకు మోదీతో సంబంధలేదని మోదీ ఫోటోను ఆ స్లోగన్‌ను తొలగించాల్సిందిగా ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌)ను సుప్రీం కోర్టు సూచించింది.

Supreme Court should remove Modi's photo Suman TVకొంతమంది అపెక్స్‌ కోర్టు నుంచి మెయిల్స్‌ స్వీకరించినవారు మోదీ ఫోటో, పార్టీ స్లోగన్‌ ఉండటాన్ని అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. మెయిల్స్‌ స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో సైతం పెట్టడం, దానిపై వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో సుప్రీం ఈ విషయంలో సీరియస్‌ అయినట్లు తెలుస్తుంది. అలాగే కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లపై కూడా మోదీ ఫోటో ఉండటాన్ని చాలామంది ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.