అప్పటి వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది : రాకేష్ తికాయత్

కొత్త వ్యవసాయ చట్టాలపై జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని స్పష్టంచేశారు.రైతు చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌డంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇది ముమ్మాటికి అన్నదాత విజయం అని.. వారి పోరాటం చరిత్రలో లిఖించదగ్గదని కొనియాడుతున్నారు.

meors minరైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నార‌ని, ఈ పోరాటంలో అనేక‌మంది అన్న‌దాత‌లు ప్రాణాలు కోల్పోయారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చి రైతుల‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేసినా రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దులను వీడివెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు రైతులు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్ తికాయత్ స్పందించారు. తమ పోరాటం ఇప్పుడే ఆపేయమని స్పష్టం చేశారు.

faorawem minఇక రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్‌ లో రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని తెలిపారు. రైతులకున్న ఇతర సమస్యలపైనా చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు.. కనీస మద్దతు ధర పెంపుపైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనల విరమణ, తదుపరి కార్యాచరణకు సంబంధించి రేపు రైతు సంఘాల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన చేసిన తర్వాత.. సింఘూ సరిహద్దుల్లో ఉన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.