యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’లో విలన్‌గా …’డిస్కోడాన్సర్’!?.

యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్’ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  ఇది  1970లలో సాగే పీరియాడికల్ లవ్ స్టోరీ. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.  ఈ సినిమాలో చాలా భాగం యూరోప్ లో చిత్రీకరణ జరుపుకుంది. తరువాత కొన్ని కీలక సన్నివేశాలు కడపలోని గండికోటలో కూడా చిత్రీకరించారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభాస్‌కి విలన్‌గా బాలీవుడ్‌ నటుడు ‘మిథున్‌ చక్రవర్తి’ని రంగంలోకి దించే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే వెంకటేశ్‌, పవన్‌ కల్యాణ్‌ ‘గోపాల గోపాల’ తర్వాత మిథున్‌కు ఇది మరో తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారని భోగట్టా.

Mithun ChakraBorthy Villain In Radhe Shyam - Suman TVబాహుబలి కట్టప్ప సత్యరాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ రాధేశ్యామ్ కు దర్శకత్వం వహిస్తున్నారు.   ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. ఇవే కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇవి పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించనున్నాడు బాహుబలి. ఇందులో ప్రభాస్ పక్కన దీపికా పడుకునే నటించబోతోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా కీలకపాత్ర పోషించనున్నారు.

ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని అలాగే ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బహుబలి, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాల తర్వాత ప్రభాస్ మరోసారి లవర్ బాయ్‏గా కనిపించబోతుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.