“బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” గేమ్ షేధించాలి అంటూ ప్రధానికి లేఖ !

పబ్ జీ ప్రపంచ దేశాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. అంత క్రేజ్ ఈ గేమ్ సొంతం. కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ గేమ్ ఆడుతూ.., ఫోన్ కి అతుక్కుపోతుంటారు. ఆకలి, నిద్ర, దప్పికలు మర్చిపోయి బ్యాటిల్ ఫీల్డ్ లో చెరిగిపోయి.. చికెన్ డిన్నర్ తో కడుపు నింపుకున్న ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. కేవలం పబ్ జీ ఆడుతూ.., ఆటలో మెళుకువలు నేర్పుతూ కోట్ల రూపాయలు సంపాదించిన గేమర్స్ ఉన్నారు. “పబ్ జీ ఈజ్ నాట్ ఏ గేమ్.. ఇట్స్ ఎమోషన్” అంటూ.. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పే అభిమానులు లేకపోలేదు. ఇంతలా ఈ మొబైల్ గేమ్ గేమర్స్ ని ఆకట్టుకుంది. కానీ.., ఈ గేమ్ చైనాకి సంబంధించినది కావడంతో.., పోయిన ఏడాది సెప్టెంబర్ 2న భారత ప్రభుత్వం దీనిపై బ్యాన్ విధించింది. భారత్ – చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం ఆనంతరం కేంద్ర ప్రభుత్వం 118 మొబైల్ యాప్ లపై నిషేధం విధించింది. అప్పటి నుంచి ఇండియాలో గేమర్స్ కి పబ్జి అందుబాటులో లేకుండా పోయింది. ఇక అప్పటి నుండి పబ్ జీ రీ లాంచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేమ్ కి ఇంత ట్రాఫిక్ ఉంది కాబట్టే.. ఆ గేమ్ భారత్ లో రీ లాంచ్ అవ్వడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే పబ్జీ సంస్థ తన ఆడియన్స్ కోసం పబ్ జీ పేరును “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” గా చేంజ్ చేసి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది.

pub 2క్రాప్టన్ సంస్థ ఇప్పటికే గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్ పోస్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించి.., ఇండియాలో తమకి కావాల్సిన మేన్ పవర్ సెట్ చేసుకుంది. ఇక క్రాఫ్టన్ సీఈవో చంగ్హాస్ కిమ్ ఇప్పటికే తమ ఇండియా పట్ల తమ నిబద్ధతకి గుర్తుగా మన పీఏం కేర్స్ కు రూ.1.5 కోట్లు విరాళం ప్రకటించారు. దీనితో పబ్ జీ రీ లాంచ్ ఖాయం అయ్యింది. ఇక ఇప్పటికే క్రాఫ్టన్ సంస్థ “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” పబ్ జీ వెర్షన్ కి ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా మొదలు పెట్టేసింది. ఇలాంటి సమయంలో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యుడు నినాంగ్ ఎరింగ్ ఈ “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” గేమ్ ని నిషేధించాలని కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు. ఈ గేమ్ ఇండియా ప్రభుత్వాన్ని, పౌరులను మోసం చేయడమే లక్ష్యంగా డిజైన్ చేశారు. దీనిని దేశంలో నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో నినాంగ్ ఎరింగ్ డిమాండ్ చేశారు. ఈ కొత్త ఆటను ప్రారంభించడం ద్వారా, దాని డెవలపర్ క్రాఫ్టన్ భారత చట్టాలను పక్కదారి పట్టిస్తోందన్నది ఈయన ప్రధాన ఆరోపణ. ఇక డేటా గోప్యత విషయంలో కూడా నినాంగ్ ఎరింగ్ తన అనుమాలను లేవనెత్తారు. పిల్లలతో సహా లక్షలాది మంది పౌరుల వినియోగదారుల డేటాను సేకరించి.., విదేశీ సంస్థలకు, చైనా ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఈ గేమ్ ఒక ఉపాయం” అని పసిఘాట్ వెస్ట్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎరింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంభందించి ఆయన మూడు పేజీల లేఖ కాపీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కానీ.., పబ్జీ లవర్స్ మాత్రం ఇదే సమయంలో “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుండి స్వీకరిస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తుండటం విశేషం. మరి.. “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” గేమ్ త్వరగా మొదలవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.