వైరల్‌.. నిర్బంధించిన గదిని శుభ్రం చేసిన ప్రియాంక గాంధీ

Congress leader Priyanka Gandhi seen sweeping the floors of the room - Suman TV

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు ఒక గదిలో నిర్బంధించారు. ఆమె ఆ గదిని చీపురుతో శుభ్రం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల్లో ఆదివారం అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ హింసాకాండలో 8 రైతులు మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ జిల్లాకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రియాంక పోలీసులను ప్రశ్నించారు. కొద్ది పోలీసులకు ప్రియాంకగాంధీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ప్రియాంకను నిర్బంధించారు. ఆమె ఆ గదిని శుభ్రం చేయడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.