మోడీని తిట్టగలను, కొట్టగలను : మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే

I can scold and hit Modi

భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను మోడీని తిట్టగలను, అవసరమైతే కొట్టగలను..అంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి నానా పటోలే మాట్లాడుతున్న వీడియో ప్రస్తుత రాజకీయాల్లో ప్రకంపనలు సృస్తిస్తోంది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు.

వీడియోలో, పటోలే భండారా జిల్లాలోని గ్రామస్తులతో మాట్లాడుతూ, “నేను మోడీని కొట్టగలను, అతనిని దూషించగలను, అందుకే అతను నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చాడు” అని చెప్పడం కనిపిస్తుంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ క్రమంలో పటోలే దీనిపై స్పందించారు.

I can scold and hit Modiతాను మాట్లాడింది ప్రధాని మోడీ గురించి కాదని.. స్థానికంగా ఉండే గూండా గురించి అని తెలిపాడు. గూండా ఇంటిపేరు మోడీనే అన్నారు. అందుకే తాను ఆ గూండాను ఉద్దేశించి మోడీని కొట్టగలను, తిట్టగలను అన్నానని తెలిపాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో ‘విషాదంగా’ వైరల్ చేస్తున్నారని ఆయన అన్నారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేజీ నియోజకవర్గం ప్రజలు మోడీ అని పిలవబడే స్థానిక గూండాల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. పటోలే జీ ఏది మాట్లాడినా అది ఆయన గురించే కానీ గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోడీ గురించి కాదు” అని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అతుల్ లోందే పాటిల్ ట్వీట్ చేశారు.