మ్యాట్రిమోనిలో విచిత్ర కోరికలు కోరిన మహానుభావుడు

భారతీయ సాంప్రదాయం ప్రకారం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు వందేళ్లు వర్ధిల్లుతాయని అంటారు. యువతీయువకులు కూడా పెద్దల మాటకు విలువ ఇస్తూ వారు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు పెద్దల సంప్రదింపులు తగ్గి మ్యారేజ్ బ్యూరో వైపే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో సైట్లలో యువతి యువకులు తమకు వ్యక్తిగత వివరాలు తెలిజేయస్తారు. అదే సమయంలో తమ అభిరుచులు, తమకు ఎలాంటి లక్షణాలు ఉన్నవారు కావాలో వివరిస్తారు. అందులో భాగంగా అందం, ఐశ్వర్యం, గుణగణాలకు సంబంధించి కొంత ప్రత్యేకంగా రాస్తారు. అది మామూలే దాని ఎవరు కాదనలేరు.

GASDG min 1ఓ వ్యక్తి ఏకంగా తనకు కాబోయే భార్య కొలతలు తనకు నచ్చిన విధంగా ఉండాలంటూ అతడు ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. ఇవే కాకుండా పలు విచిత్రమైన కోరికలను కూడా వివరించాడు. వాటిని చూసిన తర్వాత మీకు కూడా వీడి కోరికలు తగలేయ్యాని అని అనక మానరు.. “పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి”అని పెద్దలు సామెతను ఊరికే పెట్టలేదు. ఇలాంటి విచిత్ర కోరికలు కలిగిన వారి వల్లే ఆ సామెత వచ్చిందని కొందరు అంటున్నారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ పెడుతున్నారు. “ఇవేం కోరికలు నాయనా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇతడు ఏమైనా లేడీస్ టైలరా.? ఏంటి.?” అని ఒకరి కామెంట్ చేయగా..’ ఆ వ్యక్తికి ఓ బార్బీ డాల్ సెట్ కొని ఇవ్వండి’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక ఓ ట్విట్టర్ యూజర్.. ఈ ట్వీట్‌పై సదరు మ్యాట్రిమోనియల్ సంస్థను ట్యాగ్ చేసి కంప్లైంట్ ఇవ్వగా.. అతనిపై చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ పేర్కొంది.