కంచెలు లేని ప్రపంచం కావాలన్నాడు ఓ సినీ కవి. కానీ.., నేటి ఆధునిక దేశంలో అది సాధ్యమా? దేశానికి, దేశానికి మధ్య కంచె ఉండాలి. రాష్ట్రాల మధ్య హద్దులు ఉండాలి. ఇప్పుడు ఏకంగా ప్రాంతాల విషయంలో అడ్డు గోడలు పుట్టుకొస్తున్నాయి. తరతరాలుగా నివాసం ఉండే స్థానాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వాలు, అందుకు సమ్మతించని స్థానికులు.. ప్రతి దేశంలో ఈ పరిస్థితి నిత్యం కనిపిస్తూనే ఉంది. తాజాగా మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.
అస్సాం రాష్ట్రంలోని దరంగ్ ప్రాంతంలో 800 కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్న క్రమంలో పోలీసులకు వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు పౌరులు మరణించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఇంకా మరణాలను నిర్ధారించలేదు. అయితే.., ఇప్పుడు ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వందల మంది పోలీసులు తుపాకులతో ఉండగా కేవలం కర్రతో వ్యక్తి వారిపైకి పరిగెత్తుకు వచ్చాడు. దాంతో.., పోలీసులు అతన్ని కాల్చేశారు. మృతదేహంపై కూడా పిడిగుద్దులు కురిపించారు. పోలీసులే కాకుండా అక్కడున్న ఓ ఫోటో గ్రాఫర్ కూడా మృతదేహంపై కాళ్లతో తంతూ ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.