సాధారణంగా ప్రేమ, పెళ్లి వంటి బంధాల్లో.. వారి మధ్య విబేధాలు తలెత్తి.. విడిపోతే.. అప్పుడు మరోకరిని ప్రేమించడమో.. పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు. అయితే ఈమధ్య కాలంలో.. కొందరు ఒకేసారి ఒకరికి తెలియకుండా.. మరొకరిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం చేస్తున్నారు. తీరా ఏదో ఓ రోజు వీరి మోసం బయటపడటం.. ఆ తర్వాత దేహశుద్ది జరగడం వంటి సంఘటనలను చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు చూడబోయే సంఘటన అందుకు భిన్నమైంది. ఇక్కడ ఓ వ్యక్తి 20 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు. అది కూడా ఆ ముగ్గురి మహిళల అంగీకారంతో. ఆ తర్వాత వారందరిని ఓకే వేదిక మీద వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వెరైటీ వివాహం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: డిగ్రీ చదివే యువతికి లిఫ్ట్ ఇచ్చాడు.. ఫీలింగ్స్ కలుగుతున్నాయని చెప్పి!
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సమర్థ్ మౌర్య గతంలో తన గ్రామానికి సర్పంచ్‌గా పని చేశాడు.ఈ క్రమంలో ఆయనకు 2003 లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఆ తర్వాత మరి కొన్నేళ్లకు మరో ఇద్దరు మహిళతో పరిచయం ఏర్పడింది. వీరి గురించి మొదటి మహిళకు తెలుసు. సుమారు 20 ఏళ్ల నుంచి వీరు నలుగురు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి ఆరుగురు పిల్లలు కూడా జన్మించారు. ఇన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరు.. ఇప్పుడు తాజాగా పెళ్లి చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: 2000 కోళ్లు దిగుమతి చేసుకున్న ధోని.. ఎందుకో తెలుసా?2022, ఏప్రిల్ 30న ఒకే వేదికపై ఈ ముగ్గురిని వివాహం చేసుకున్నాడు సమర్థ్. గిరిజన సంప్రదాయం, ఆచారాల ప్రకారం.. డోలు వాయిద్యాల నడుమ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వీరి పెళ్లి వేడుక చూడ్డానికి గ్రామంలోని జనాలంతా హాజరయ్యారు. వీరి ఆరుగురు పిల్లలు ఈ వివాహ వేడుకలో పాల్గొనడం గమనార్హం. ఈ వెరైటీ పెళ్లి.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘ఐ లవ్యూ జాను.. నీ కోసం 100 సార్లైనా చచ్చిపోతా’.. భర్త సూసైడ్ నోట్ వైరల్!