టీకా సర్టిఫికెట్ పై ప్రధాని మోదీ చిత్రాన్ని తొలిగించాలంటూ వేసిన పిటీషన్ పై కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరే దేశమూ వారి ప్రధానుల ఫొటోలు సర్టిఫికేట్ పై ముద్రించలేదంటూ చెప్పుకొచ్చిన పిటీషనర్ కు జస్టిస్ కున్హికృష్ణన్ చెప్పిన జవాబు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ పటీషన్ ను కొట్టివేయడమే కాకుండా.. పిటీషనర్ కు రూ.లక్ష జరిమానా విధించింది. ఇప్పుడు ఈ కేసు తీర్పు, జరిమానా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kerala High Court dismisses a petition challenging the photograph of PM Narendra Modi affixed on the COVID-19 vaccination certificates; imposes a fine of Rs 1 Lakh to be paid by the petitioner to the Kerala Legal Services Authority within 6 weeks. pic.twitter.com/NqNfI3g8Ql
— ANI (@ANI) December 21, 2021
‘ఎవరూ కూడా కాంగ్రెస్ ప్రధాని, బీజేపీ ప్రధాని, మరే పొలిటికల్ పార్టీకి చెందిన ప్రధాని అని అనరు. ఒకసారి ప్రధానిగా ఎన్నకైన తర్వాత ఆయన దేశ ప్రజలందిరికీ ప్రధానే. ప్రధాని పదవిని చూసి ప్రతి పౌరుడు గర్వించాలి. ప్రధాని అనుసరించే విధానాలను వ్యతిరేకించవచ్చు. ఇలాంటి విపత్కర సమయాల్లో స్ఫూర్తినింపే సందేశంతో ప్రధాని ఫొటో టీకా సర్టిఫికేట్ పై ఉంటే సిగ్గు పడాల్సిన అవసరం లేదు’ అంటూ జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ వ్యాఖ్యానించారు.
Kerala HC imposes rs 1 lakh fine for ‘frivolous’& ‘political motivated’ petition against pm Modi photo on vaccine certificates
— Abhidny Lokhande (@abhidnyalokhn10) December 21, 2021
మరే దేశాలు వారి ప్రధాని చిత్రాన్ని ముద్రించలేదన్న వాదనకు.. న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘వారు వారి ప్రధానిని చూసి గర్వపడటం లేదేమో? మన ప్రధానిని చూసి మేము గర్వపడుతున్నాం’ అంటూ జస్టిస్ కున్హికృష్ణన్ సమాధానమిచ్చినట్లు PTI వార్తా సంస్థ కోట్ చేసింది. ఎన్నో ముఖ్యమైన పిల్స్ దాఖలవుతున్న సమయంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని వ్యాఖ్యానించారు.
పిటీషినర్ కు వేసిన జరిమానాను ఆరు నెలల్లో కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆలోపు కట్టలేకపోతే అతని ఆస్తులను అమ్మి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. జస్టిస్ పి.వి.కున్హికృష్ణణ్ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KeralaHighCourt has dismissed the plea which had sort the removal of PM’s picture from the vaccine certificate; imposed a fine of Rs 1 lakh on the petitioner.
Vivek with analysis. pic.twitter.com/9MyDYzmWEf
— TIMES NOW (@TimesNow) December 21, 2021