జూనియర్ ఇంజనీర్ నివాసంలో ఏసీబీ సోదాలు! ఆ ఇంట్లో డబ్బుల వర్షం!

Karnataka

డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ.., ఎంచుకున్న ఆ మార్గం నీతిగా, నిజాయతీగా ఉండాలి. అలా కష్టపడి సంపాదించిన డబ్బే మనతో కలకాలం ఉంటుంది. అలా.. కాకుండా అవినీతికి పాల్పడుతూ కోట్లు వెనకేసుకున్నా.., ఆ డబ్బు మనకి కళంకాన్ని అంటి మరీ చేజారాక తప్పదు. తాజాగా ఈ విషయం మరోసారి నిజం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని కలబురగి ప్రాంతం అది. అక్కడ ఓ పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ నివాసం ఉంటున్నాడు. అతను అవినీతి ఆఫీసర్ అని అందరికీ తెలుసు. ఏ ఫైల్ అయినా.. సర్ నుండి ముందుకి జరగాలంటే వేలల్లో, లక్షల్లో సర్ కి ముట్ట చెప్పాల్సిందే. ఇదంతా సర్ చేసే ఓపెన్ దందా! కానీ.., పాపం పండే రోజు అంటూ ఒకటి ఉంటుంది కదా? ఆ జూనియర్ ఇంజినీర్ కి కూడా అలాంటి ఓ రోజు వచ్చింది.

కర్ణాటక ఏసీబీ అధికారులు ఆ సర్ ఇంటిపైన ఒక్కసారిగా రైడ్ చేశారు. మామూలు జూనియర్ ఇంజినీర్ కదా? మహా అయితే.. కొద్దిపాటి డబ్బు మాత్రమే దొరుతుందిలే అనుకున్నారు అధికారులు. కానీ.., ఆ సోదాల్లో భారీగా డబ్బు బయట పడింది. మొత్తం అరకోటి పైనే. ఇంత డబ్బు బయట పడటం ఒక ఎత్తైతే.. జూనియర్ ఇంజినీర్ ఆ నల్లడబ్బుని స్టోర్ చేసిన విధానం దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది.

పదమూడు లక్షల రూపాయల డబ్బుని ఆ జూనియర్ ఇంజినీర్ డ్రైనేజ్ పైపులో దాచాడు. ఇల్లు మొత్తం వెతికిన అధికారులకి ఆ డ్రైనేజి పైపు దగ్గరికి వెళ్ళగానే ఎందుకో అనుమానం వచ్చింది. ఆ పైపు ని కట్ చేస్తే.. డబ్బుల వర్షం కురవడం మొదలయింది. ఈ ఘటనతో ఏసీబీ అధికారులు సైతం షాక్ కి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.