భారతదేశం వివిధ సంప్రదాయాలు, సంస్కృతులకు పుట్టిల్లు. ఇక మన దేశంలో వివాహ వేడుకలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. ఒక్కోచోట ఒక్కోరకమైన పద్దతులు పాటిస్తారు. ఎలా చేసినా.. ఆ వివాహం ఉద్దేశం మాత్రం.. ఇద్దరు జీవితాంతం కలిసిమెలిసి ఉండటమే. అయితే పెళ్లి అనగానే సాధారణంగా అమ్మాయి-అబ్బాయిలకు మధ్య జరగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో స్వలింగ వివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక రెండో వివాహం మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. వీరు కాక మరి కొందరు నిత్య పెళ్లికొడుకులు, పెళ్లి కుమార్తెల వ్యవహారం అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వివాహ వేడుక ఇందుకు పూర్తి విరుద్ధమైనది. ఎందుకంటే.. ఇక్కడ వివాహ తంతు జరుగుతున్నది మనుషులకు కాదు.. చనిపోయిన వారికి.. అంటే సరిగా చెప్పాలంటే ఆత్మలకు. సుమారు 30 ఏళ్ల క్రితం పురిటిలో చనిపోయిన వారికి ఇప్పుడు శాస్త్రోక్తంగా వివాహం చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. ఎందుకు.. ఏంటి వంటి తదితర వివరాలు.. ఈ వింత పెళ్లి గురించి ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ఈ వింత పెళ్లి గురించి సదరు యూజర్ ఇలా రాసుకొచ్చాడు. ‘‘ఈ మధ్య కాలంలో నేను ఓ వివాహానికి హాజరయ్యాను. అన్ని పెళ్లిల్ల మాదిరి జరిగితే.. దాని గురించి నేను మీకు చెప్పేవాడిని కాదు. కానీ ఇక్కడ జరిగిన పెళ్లిలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె 30 ఏళ్ల కిందటే చనిపోయారు. కానీ, వాళ్లకి ఇప్పుడు పెళ్లి జరిగింది. దక్షిణ కన్నడ ప్రాంతంలో ఇది సంప్రదాయంగా వస్తుంది. మీ అందరికీ వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం’’ అంటూ మంగళూరులో జరిగిన వింత పెళ్లి వీడియోలను పోస్ట్ చేశాడు. చనిపోయిన వారికి చేసే పెళ్లి కదా.. అంటే ఏదో తూతుమంత్రంగా చేసి ఉంటారు అనుకుంటే పొరపాటు. సాధారణంగా బతికున్న వారి పెళ్లిల్లు ఎంత ఘనంగా జరుగుతాయో.. ఈ వివాహం కూడా అంతే గ్రాండ్‌గా జరిగింది. మొదట అబ్బాయి వారు తెచ్చిన చీరను పెళ్లి కుమార్తె ధరించాలి. అందుకు కొంత సమయం కూడా ఇస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు వారిద్దరూ ఏడడుగులు కూడా నడుస్తారు. తాళికట్టడం, ఆశీస్సులు తీసుకోవడం, చదివింపులు, అత్తింటికి వెళ్లడం ఇలా బతికున్న వారి పెళ్లిలో జరిగే అన్ని కార్యక్రామాలు ఇక్కడా జరిగాయి. పెళ్లికి వచ్చిన వారికి రుచికరమైన వంటలు కూడా వడ్డిస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ వివాహం ఎంత వైభవంగా సాగుతుందో అంటూ పోస్ట్ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘‘మరి ఇలా మరణించిన వారికి వివాహం చేయడం సులభం అనుకుంటున్నారేమో చాలా కష్టం. ఇక్కడ కూడా అమ్మాయి, అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చాలి. ప్రస్తుతం ఇక్కడ జరిగిన వివాహంలో.. ఈ వధువు కంటే ముందు ఓ సంబంధం చూశారు. అయితే ఆమె వయసు ఎక్కువ అనే కారణంగా ఆ సంబంధం వద్దనుకున్నారు. తమ బిడ్డలు మరణాంతరం కూడా సుఖంగా ఉండాలని ఘనంగా ఈ వివాహం జరిపించారు పెద్దలు. అయితే ఈ వివాహానికి పెళ్లి కాను వారు హాజరుకాకుడదు’’ అంటూ ఈ వింత వివాహం గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. , there will be marriage procession and finally tieing the knots. If you are wondering its easy to fix this marriage, hear me out. Recently groom family rejected a bride because bride was few year elder to the groom! Anyway I find these customs beautiful. — AnnyArun (@anny_arun) July 28, 2022 I reached a bit late and missed the procession. Marriage function already started. First groom brings the 'Dhare Saree' which should be worn by the bride. They also give enough time for the bride to get dressed! pic.twitter.com/KqHuKhmqnj — AnnyArun (@anny_arun) July 28, 2022 While bride getting ready groom is already waiting. Isn't that always a thing? pic.twitter.com/7QvFCiI3Re — AnnyArun (@anny_arun) July 28, 2022 Finally the bride's family passing the responsibility of their daughter to the grooms family. Usually the most emotional part of the marriage ceremony. pic.twitter.com/giEZtOl2fa — AnnyArun (@anny_arun) July 28, 2022 ఇది కూడా చదవండి: సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న టాప్ హీరోయిన్..! ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: ప్రియురాలి పెళ్లిలో ప్రియుడి హల్చల్!