Lover Marriage: మనస్పూర్తిగా ప్రేమించిన అమ్మాయి పెళ్లంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి. కొంతమంది ‘నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వదిలి వెళుతున్నా’.. అనుకుంటూ ఆ బాధ తట్టుకోలేక లోలోపల కుమిలిపోతారు. మరికొంతమంది నన్ను కాదని ఇంకొకడ్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా అంటారు. ప్రియురాలి పెళ్లి ఆపటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. విజయం సాధిస్తారు.. లేదా దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ పాలవుతారు. ఏం జరిగినా అనుకున్నది మాత్రం చేసి తీరతారు. బిహార్‌కు చెందిన ఓ యువకుడు కూడా తన ప్రియురాలికి పెళ్లంటే తట్టుకోలేకపోయాడు. పెళ్లి మండపంలోకి దూరి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. బిహార్, నలందకు చెందిన ముఖేష్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఏడాదికాలం చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అయితే, వీరి పెళ్లికి అమ్మాయి వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి బలవంతంగా వెరే పెళ్లి నిశ్చయం చేశారు. మంగళవారం రాత్రి ముఖేష్ ప్రియురాలి పెళ్లి వేడుక జరిగింది. ఈ విషయాన్ని ప్రియురాలే స్వయంగా ముఖేష్‌కు ఫోన్లో సమాచారం అందించింది. ముఖేష్ వెను వెంటనే అక్కడికి వచ్చాడు. పెళ్లి కొడుకు తన ప్రియురాలి నుదిటిన సింధూరం పెడుతున్నపుడు అడ్డుకున్నాడు. ఆమె మెడలో దండకూడా వేయనీయలేదు. ప్రియురాలిని హత్తుకుంటూ హల్ చల్ చేశాడు. పెళ్లి కూతురి తరపు వాళ్లు కొట్టినా పట్టించుకోలేదు. చివరకు పెళ్లి కుమారుడి బంధువులు ఇదంతా చూసి ఆలోచనలో పడ్డారు. అమ్మాయి మెడలో తమ అబ్బాయి తాళి కట్టడం మంచిది కాదని భావించి పెళ్లి ఆపుచేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Anand Mahindra: అవసరమే అన్నీ నేర్పుతుంది.. ఆనంద్ మహీంద్రాను మెప్పించిన యువకుడు!