వాహనదారులు అదిరిపోయే శుభవార్త. రూ.60కే లీటర్ పెట్రోల్!

Modi Petrol Diesel India

దేశంలో ఇప్పుడు సామాన్యుడిని బెంబేలు ఎత్తిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది పెట్రోల్, డీజిల్ ధరలు. రోజురోజుకి పెరుగుతూ పోతున్న పోతున్న పెట్రోల్ ధరకి అస్సలు బ్రేక్ పడటం లేదు. దేశంలో ఇప్పుడు తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.100 దాటిపోయింది. ఇప్పుడు ఈ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ కి తెర తీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రూ.60కే లీటర్ పెట్రోల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్-డీజిల్‌పై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించే పనిలో పడింది. ఇందుకోసం రానున్న కాలంలో యూరో -6 ఉద్గార ప్రమాణాల ప్రకారం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయాలని.. వాహన తయారీదారులను ప్రభుత్వం కోరబోతుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ కి, పెట్రోల్ రేటు తగ్గడానికి మధ్య లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కిటుకు.

Modi Petrol Diesel India

ఫ్లెక్సిబుల్ ఇంధనం అనేది గ్యాసోలిన్ , ఇథనాల్ కలయికతో తయారు చేయబడిన ప్రత్యామ్నాయ ఇంధనం. రానున్న కాలంలో కంపెనీలు అన్నీ ఈ ఇంజిన్ ఉన్న వాహనాలు డిజైన్ చేసుకుంటే.. పెట్రోల్-డీజిల్ తో అవసరం ఉండదు. ఈ ఇథనాల్ ధర లీటరుకు 60-62 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్ మాత్రం పక్కాగా అమలు చేయగలిగితే ప్రజలకు పెట్రోల్, డీజిల్‌ ని అధిక ధరకి కొనాల్సిన బాధలు తప్పుతాయి. రానున్న ఏడాది కాలంలోనే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. మరి.. రూ.60కే లీటర్ పెట్రోల్ వచ్చే ఈ యాక్షన్ ప్లాన్ సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.