జూహీ చావ్లాకీ 25 లక్షలు జరిమానా విధించిన డిల్లీ హైకోర్ట్!..

5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీని ప్రశ్నిస్తూ జుహీ, మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ జేఆర్‌ మీధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపభూయిష్ఠమైన ఈ వ్యాజ్యాన్ని ప్రచారం కోసం వేశారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్‌గ్రేడ్‌ కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లోని వాదన సహేతుకంగా లేదని అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంది. చట్టం పనితీరును జుహీ చావ్లా అవమానించారని ఫైర్ అయిన కోర్టు ఆమెతోపాటు మరో ముగ్గురిపై రూ.20 లక్షల జరిమానా విధించింది.

juhi chawla.1.1111848పబ్లిసిటీ కోసమే జుహీ పిటిషన్ వేశారని ఫైర్ అయ్యింది. ఈ కేసు వాదనల తాలూకు లింకును జుహీ సోషల్ మీడియాలో పెట్టారని దీని వల్ల వాదనకు మూడుమార్లు అంతరాయం కలిగిందని కోర్టు మండిపడింది. ఈ అంతరాయానికి కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం ప్రొసీడింగ్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సీరియస్‌ అయింది. జూహీ చావ్లాతోపాటు పలువురికి రూ.20లక్షల జరిమానా విధించింది.