జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్స్..

సాధారణంగా నేషనల్ హైవే పై జనాలు గుమి కూడితే అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందని అందరం వెళ్లి చూస్తుంటాం.. కానీ అక్కడ సీన్ చూసి జనాలు ముక్కున వేలు వేసుకొని వింతగా ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా? ప్రతిరోజూ వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్​లు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం… అందరినీ ఆశ్చర్య పరిచింది.

condomes2 minకర్ణాటక తుముకూర్​ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్ లు పడి ఉండటంపై రక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాజ్​ థియేటర్​కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్​పై కండోమ్​లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇవి ఎవరైనా కావాలని వేసి ఉంటారా.. లేక ఏదైనా వాహనం నుంచి జారి పడిపోయి ఉంటాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఈ విషయం పై ఇప్పటి వరకు అధికారులు మాత్రం స్పందించలేదు. హైవే పై ఏంటీ దరిద్రం అంటూ..వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.