భార్యాభర్తలిద్దరూ సివిల్​ సర్వీసెస్.. కయ్యంతో రచ్చకెక్కిన వీరి వివాదం..!

Civil Service Spouses Dispute in Karnataka - Suman TV

ప్రభుత్వ సివిల్​ సర్వీసస్ ఉద్యోగాల్లో స్థిరపడ్డా నితిన్​ సుభాష్​ లోలా, ఐపీఎస్​ అధికారిణి వర్తికా కటియార్ భార్యాభర్తల వ్యవహారం రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. గతంలో నా భర్త నితిన్​ సుభాష్​ లోలా నాపై అదనపు కట్నం తేవాలని హింసించినట్లుగా ఆరోపణలు సైతం బయటపెడుతోంది భార్య. “2017లో లఖ్​నవూలో కర్ణాటక ఐఏఎస్​ అధికారి అనురాగ్​ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇక ఆయన మరణం వెనుక నా భార్య కటియార్​ హస్తం ఉందంటూ భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్​కు లేఖ రాశారు. ఇలా వీరి వ్యవహారం రోజు రోజుకు రచ్చకెక్కుతూ వివాదంగా మారుతోంది. ఇక తన భర్త నాపై లేని పోని ఆరోపణలను సృష్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో ఆయన నాపై యాసిడ్ దాడికి పాల్పడ్డడంటూ చెప్పికొచ్చింది.

Civil Service Spouses Dispute in Karnataka - Suman TVఇక 11 ఏళ్ల క్రితమే నేను పోలీస్ శాఖలో చేరానని, ఇలాంటి దర్యాప్తులకు నేను భయపడనని గట్టిగా సమాధానం ఇచ్చింది. ఈ విధమైన వీరి వివాదం రోజు రోజుకు ముదురుతుండటంతో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ హోదాలో ఉండి సంసారాన్ని రోడ్డుకు ఈడ్చుకోవటమేంటని, సమాజానికి వీరిచ్చే సందేశమేంటంటూ కామెంట్ల చేస్తున్నారు. ఇక ఈ సివిల్​ సర్వీసస్ భార్యాభర్తల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.