పెళ్లిలో ఊహించని సంఘటన.. చరిత్రలో నిలిచి పోతుంది..!

Bride Mother Issue

గత కొంత కాలం నుంచి పెళ్లి మంటపాలు వైరల్‌ సంఘటనలకు వేదికలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మహా అయితే.. వధువరులు డ్యాన్స్‌ చేయడం, వరుడు తాగి రావడం, సడెన్‌ గా పెళ్లి ఆగిపోవడం, తాళి కట్టే సమయంలో వధువు పెళ్లి వద్దనడం ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త నెవ్వర్‌ బీఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌. చరిత్రలో నిలిచిపోతుంది.

ఇప్పటి వరకు మనం పెళ్లికి ముందు గర్భం దాల్చిన వారి గురించి విన్నాం. ఆఖరికి సినిమాల్లో కూడా.. గర్భంతోనే పెళ్లి పీటలు ఎక్కిన వారిని చూపించారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వధువు ఏకంగా పెళ్లి రోజునే బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిన సంఘటనతో పెళ్లికి వచ్చిన వారు మూర్ఛపోయారు. ఇక ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలిసి.. షాక్‌ తో బిగుసుకుపోయారు. ప్రపంచంలో ఇన్ని ట్విస్టులున్న సినిమా కూడా ఇంతవరకు రాలేదని అంటున్నారు దీని గురించి తెలిసిన వారు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి : IAS వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బడేరాజ్‌పూర్‌ జిల్లాలోని బాన్స్‌కోట్‌లోని ఓ గ్రామంలో జరిగింది. ఒడిషాలోని కేట్‌గిరి జిల్లా నవరంగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన షీఫ్‌ బట్టీ మందాని అనే యువతికి, బాన్స్‌కోట్‌కి చెందిన చందన్‌ నేతన్‌ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. ఇంతలో పెళ్లి కుమార్తె ఉన్నట్లుండి భరించలేని కడుపునొప్పితో బాధపడసాగింది. దాంతో పెళ్లి తంతుని అర్ధాంతరంగా ఆపేశారు. వెంటనే పెళ్లి కుమార్తెని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Bride Mother Issue

పెళ్లి కుమార్తెని పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భవతి అని.. పురిటి నొప్పులతో బాధపడుతుందని చెప్పారు. ఇక సదరు పెళ్లి కుమార్తె వివాహం రోజునే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పాటు.. వివాహానికి హాజరైన బంధువులు కోలుకోలేని విధంగా షాక్‌ కు గురయ్యారు. పెళ్లికూతురు తల్లి కావడం ఏంటని ఆశ్చర్యపోయారు. దీని గురించి వధువును నిలదీయగా.. ఆమె అసలు విషయం బయటపెట్టింది.

ఇది కూడా చదవండి : కరోనాతో స్నేహితుడి మృతి.. ఆ వ్యక్తి చేసిన పనికి అందరూ ఫిదా

గతేడాది తనకు, చందన్‌ నేతన్‌ తో పరిచయం ఏర్పడిందని.. అది కాస్త ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. ఆరు నెలల నుంచి వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇక వీరి ప్రేమ గురించి పెద్దలకు తెలియడం.. వారు అంగీకరించడంతో.. పెళ్లికి ముహుర్తం పెట్టారు. ఇక బంధుమిత్రులు సమక్షంలో ఘనంగా పెళ్లి చేస్తుండగా.. ఈ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు.

ప్రస్తుతం తల్లీబిడ్డల ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే తమ బిడ్డకు పెళ్లి చేస్తామని మందాని కుటుంబ సభ్యులు తెలిపారు. ఊళ్లో జనం మాత్రం ఇలాంటి విడ్డూరం మేం ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.