చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వీడియో వైరల్

ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ వింత జరిగినా.. ఏ సంఘటనలు జరిగినా క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అందులో కొన్ని భయాన్ని పుట్టించగా.. మరికొన్ని వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.

bilugg minగత కొంత కాలంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పాత భవనాలు కూలిపోతున్నాయి. అయితే ఈ భ‌వ‌నం ముందే ఒక‌వైపు వంగిపోవ‌డంతో స్థానికులు ఇచ్చిన సస‌మాచారం అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకుని అంద‌రినీ ఖాళీ చేయించారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉందంటున్నారు.

bgavana minఅయితే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సంగా పడుతున్న నేపథ్యంలో పలు పాత భవనాలు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి.. ఈ నేపథ్యంలో అధికారులు అలాంటి ఇళ్లను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ముందుగానే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.