సినిమాల్లో కూడా చూడని ప్రేమ కథ.. కొత్త ఐడియాతో వధువు ఎంపిక..!

bride selection

కర్ణాటకలోని సకలేశపుర ప్రాంతాంనికి చెందిన ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల ప్రేమలో పడ్డాడు. ఒకరికి తెలియకుండా మరోకరిని ప్రేమలోకి దించాడు. కొంత కాలం ఈ ప్రేమకథను గుట్టుచప్పుడు కాకుండా నడిపాడీ ఈ యువకుడు. ఇక ఎట్టకేలకు అసలు విషయం తెలిసిన ఓ అమ్మాయి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అతనిని నేను పెళ్లి చేసుకుంటానని గట్టిగా తెలిపింది.

ఇదే విషయం చివరికి గ్రామస్తుల వరకూ వెళ్లింది. ఇద్దరు యువతులు అతన్నే పెళ్లి చేసుకుంటామని చెప్పటంతో గ్రామ పెద్దలకు ఏం చేయాలో తోచలేదు. ఇక చివరికి గ్రామ పెద్దలు ఓ ఊహించని ఐడియాను ఆ ముగ్గురి ప్రేమికుల ముందు ఉంచారు. లాటరీ తీస్తామని దాని ప్రకారమే ఎవరు పేరు అందులో వస్తే వాళ్లే ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పారు.

దీంతో పెద్దల నిర్ణయానికి తలొగ్గకుండా ముగ్గురూ సై అన్నారు. మొత్తానికి గ్రామ పెద్దలు తీసిన లాటరీలో మాత్రం విషం తాగిన యువతి పేరు వచ్చింది. దీంతో అనుకున్న ప్రకారం ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నా, మరో యువతికి మాత్రం నిరాశే మిగిలింది. తాజాగా కర్ణాటకలోని జరిగిన ఈ వింత పెళ్లికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త ఐడియాతో జరిగిన వధువు ఎంపికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.