కొన్నిటిని చూసినప్పుడు, "కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకండి ఇలాంటి వాళ్లు బతకడం. బతకాలన్న మూడు, ఉత్సాహం సర్వ నాశనమైపోతాయి. నాకింట్రస్ట్ పోయింది. పౌడర్ డబ్బాలో జీవితం పోతే పోనియ్యండి" అని అనాలనిపిస్తుంది. వింత అనుభవాలు ఎదురైనప్పుడు ఇలానే తిట్టుకుంటారు చాలా మంది. అయితే పెద్ద పెద్ద బిగినిస్ మ్యాగ్నెట్లు మాత్రం సోషల్ మీడియాలో అభిమానులతో తమకు ఎదురైన వింత అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా విభిన్నమైన పోస్ట్‌లతో ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన మరో పోస్ట్‌తో ఆకట్టుకున్నారు. ఆ పోస్ట్ మరణ ధృవీకరణ పత్రానికి సంబంధించింది. ప్రభుత్వాలు ఆన్లైన్లో డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తాయన్న విషయం తెలిసిందే. బీమా కవరేజీలు, ప్రభుత్వ ఫింఛన్లు వంటి ప్రయోజనాలు పొందాలంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికేట్కు అప్లై చేయాలి. ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగే పని లేకుండా ఆన్లైన్లోనే అప్లై చేసుకునే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించాయి. అయితే ఇక్కడే ఉంది అసలు చిక్కు. అప్లై చేసేటప్పుడు వెబ్సైట్లో రెండు ఆప్షన్లు అడుగుతుంది. 'మీ కోసం అప్లై చేసుకుంటున్నారా? లేక వేరే వ్యక్తి కోసం అప్లై చేసుకుంటున్నారా' అని రెండు ఆప్షన్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదండోయ్, "మరో జన్మ ఉందని విశ్వసించే వాళ్ళం మనం మాత్రమే కాదు" అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ఫోటోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. "రెండో ఆప్షన్ బానే ఉంది గానీ, మొదటి ఆప్షన్ కోసం చచ్చినోడ్ని ఎక్కడ నుంచి తీసుకురావాలని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ప్రభుత్వం కూడా రెండో జన్మ ఉందని నమ్ముతుందని, అయితే చచ్చినోడు మళ్ళీ తిరిగొచ్చి డెత్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకుంటాడని" ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఫోటోషాప్‌లో ఎడిట్ చేసింది కావొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆనంద్ మహీంద్రా స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారో లేక తన సొంత అనుభవాన్ని షేర్ చేశారో తెలియదు గానీ ఆయన చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. So we’re not the only culture that believes in an afterlife… pic.twitter.com/OPQF5cPRd8 — anand mahindra (@anandmahindra) July 27, 2022 ఇది కూడా చదవండి: ఈ 13 నగరాల్లోనే ముందుగా 5G సేవలు.. ఇందులో మీ నగరం ఉందో లేదో చెక్ చేసుకోండి! ఇది కూడా చదవండి: లైఫ్ ని మార్చుకునే ఉత్తమ మార్గం చెప్పిన త్రివిక్రమ్.. వీడియో వైరల్!