కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 8 మంది ఏపి కూలీలు దుర్మరణం!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా తీసుకుంటున్నా.. అతి వేగం.. మద్యం సేవించి వాహనాలు నడపడం.. నిద్ర లేపి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది అంగవైకల్యంతో కష్టాలు పడుతున్నారు.

accg minతాజాగా కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మృతిచెందారని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.