ఆనందయ్య కరోనా మందుపై నటసింహం బాలకృష్ణ స్పందన !..

నెల్లూరు ఆనందయ్య మందు తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిశోధనను ముమ్మరం చేసింది. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల హెచ్‌వోడీలు, పీజీ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం కరోనా నివారణకు మందును తయారు చేసేందుకు టీటీడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్‌ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించిన బాలయ్య బాబు ఆనందయ్య మందుపై కూడా స్పందించారు.

balakrishna ramadandakam

ఆనందయ్య మందుపై స్పందించిన బాలకృష్ణ నాకు నమ్మకం ఉందయ్యా. అభిమానం లేనిదే ఆరాధన లేదు.ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు.అలానే ప్రతీదీ ఓ నమ్మకం. నేను తప్పకుండా నమ్ముతానని అన్నారు బాలకృష్ణ. మన దగ్గర గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడు ఉండేవాడు. ఆస్త్రేలియా మెల్ బోర్న్ లో ఇప్పటికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరు ఉంటుందని బాలయ్య గుర్తుచేశారు. తనకు తెలిసింది కొంతే అని.  నాన్న గారికి ఇలాంటి విషయాలు చాలా తెలుసని.,  ఆయన ఆకాశం లాంటి వారని అన్నారు బాలకృష్ణ. ఆనందయ్య మందుపై మొదటిసారి స్పందించి తనకు నమ్మకం ఉందని చెప్పి షాక్ ఇచ్చారు బాలకృష్ణ.