అందరి ముందే అమ్మాయితో నాగ చైతన్య కొంటె చేష్టలు-వీడియో

ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యమంగా చెప్పాలంటే ప్రముఖులు ఇంకా కేర్ గా ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా వాళ్లైతే ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. అందులోను పబ్లిక్ ఫంక్షన్లలో సినిమా ప్రముఖులను అంతా గమనిస్తుంటారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సెల్ ఫోన్లలో ఇట్టే బంధించేస్తారు.

ప్రధానంగా కెమెరాలున్న సంద‌ర్భంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్‌, మాట్లాడే మాట‌ల‌ను అందుపులో ఉంచుకోవాలి. ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా, కెమెరాల‌కు అడ్డంగా దొరికిపోతారు. ఇదిగో ఇప్పుడు అక్కినేని క‌థానాయ‌కుడు నాగ చైత‌న్య ఈ విష‌యాన్ని మ‌ర‌చిపోయారేమో. ఆయ‌న‌కు సంబంధించిన ఓ స్టేజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Daksha Nagarkar 1

తాజాగా నాగ చైత‌న్య బంగార్రాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్టేజ్‌ పై ఉన్న హీరోయిన్‌ తో నాగ చైత‌న్య ప్ర‌వ‌ర్తించిన తీరు కెమెరా కంటికి చిక్కింది. హీరోయిన్ ద‌క్షా నగార్క‌ర్ వైపు నాగ చైత‌న్య చూడ‌గా, ఆమె కంటితో ఏదో సైగ చేసింది. దానికి నాగ చైత‌న్య ముసి ముసిగా న‌వ్వుకున్నారు. ఇలా చైత‌న్య‌, దక్షా న‌గార్క‌ర్ చిలిపి చేష్ట‌లు కెమెరా కంటికి చిక్కాయి.

అది చాలు కదా.. స‌ద‌రు వీడియోను నెటిజన్స్ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. విడాకులు తీసుకున్న త‌రువాత నాగ‌చైత‌న్య ప‌లానా హీరోయిన్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాడ‌ని, లేదు మ‌రో హీరోయిన్‌ ప్రేమలో పడ్డాడని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో ఇలాంటి వీడియో దొరికితే ఇంకేమైనా ఉందా.. నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతూ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.