లక్షల కోట్లకు అధిపతి.. జేబులో రూపాయి లేదు

ambani

బిజినెస్ డెస్క్- భారత్ లో అత్యంత ధవంతుడు ఎవరంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోనే ఆగర్బ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ అని అందరికి తెలుసు. రిలయన్స్ సంస్థకు ఒక్క భారత్ లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా చాలా గొప్ప పేరు ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 13 వ స్తానంలో ఉన్నారు. ముఖేశ్ సంపద విలువ దాదపు 5 లక్షల కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. అంటే ముఖేష్ అంబానీ ఆస్తి మన రెండు తెలుగు రాష్ట్రాల ఒఖ సంవత్సర బడ్జెట్ అన్నమాట. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ముఖేశ్ ఎంత మేర ధనవంతుడో. ఇక ముంబయిలో ముఖేశ్ అంబానీ ఉండే ఇంటి విలువే 14 వేల కోట్ల రూపాయలు అంటే అతియోశక్తి కాదు.

ambani

ఆయన ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్లాలంటే కేవలం హెలికాప్టర్ ను మాత్రమే వాడతారు. ఇక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సొంత విమానాలు సిద్దంగా ఉంటాయి. అది ముఖేష్ అంబానీ రేంజ్. మరి అటువంటి ముఖేష్ అంబానీ ఎక్కడికైనా వెళ్తే అయన పర్స్ లో డబ్బులు ఎంత ఉంటాయి. ఆయన దగ్గర ఏటీఎం కార్డులు ఎన్ని ఉంటాయి. ముఖేశ్ అంబానీ క్రెడిట్ కార్టుల లిమిట్ ఎంత మేర ఉంటుంది.. ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతుంటాయి. ఐతే అసలు నిజం తెలిస్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఉహించని విధంగా ముఖేశ్ అంబానీ పర్సులో కనీసం రూపాయి కూడా ఉండదట. ఆసలు ఆయన తన పర్సులో ఏ మాత్రం డబ్బులు పెట్టుకోరట. వినడానికి వింతగా ఉంది కాదా. అంత శ్రీమంతుడు పర్సులో కనీసం కొంత డబ్బులైనా ఉంచుకోవాలి కదా అనే కదా మీ ప్రశ్న.

ఆయన దగ్గర డబ్బులే కాదు.. కనీసం ఎటీఎం కార్డులు, క్రెటిట్ కార్డులు కూడా ఉండవట. ఈ విషయాన్ని స్వయంగా ముఖేశ్ అంబాని చెప్పారు. మరి ఆయనకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఐతే ఎలా అనే కదా మీ ప్రశ్న.. ముకేశ్ అంబానీ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట దాదపు వంద మందికి పైగానే ఉంటారు. అందులో సెక్యూరిటీ వాళ్లతో పాటు వ్యక్తిగత సహాయకులు, అకౌంటెంట్ వంటి వారు చాలా మంది ఉంటారు. ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సి వస్తే.. వీరే ఆ డబ్బులు కట్టేస్తారు. దీంతో ముకేశ్ అంబానీకి డబ్బులతో, ఏటీఎం కార్డులతో పని ఉండదు. ముఖేశ్ అంబానీకి రోడ్డుపై దొరికే స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. రోడ్డు మీద వెళ్లేటప్పుడు మంచి ఫుడ్ కనిపిస్తే వెంటనే కారు ఆపి ఎంచక్కా తినేసి వెళ్తిపోతారట. అంతే కదా డబ్బులు ఉన్న వాళ్లు ఏంచేసినా సరదాగానే ఉంటుంది మరి.