రేపటి నుంచి తెంలగాణలో లాక్ డౌన్

హైదరాబాద్- తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో ఈనెల 12 నుంచి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ లో రెండు గంటలకు సమావేశమైన తెలంగాణ క్యాబినెట్.. లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. మొత్తం పది రోజుల పాటు రాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు. అంటే ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను ఉదయం 6 నుంచి 10 గంటల లోపు తెచ్చుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి మళ్లీ లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. ఈనెల 21 వరకు లాక్ డౌన్ కొనసాగించి.. మరోసారి కరోనా పరిస్థితులపై సమీక్షించిన తరువాత లాక్ డౌన్ పొడగింమపుపై నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు కరోనా టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.