తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడగింపు

హైదరాబాద్- తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ను పొడగించారు. మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను పొడగిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే మే 31 నుంచి పది రోజుల పాటు జూన్ 9 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఐతే ఈ సారి లాక్ లౌన్ సడలింపు సమయాన్ని కొంత మేర పెంచారు. ఇంతకు ముందు ఉదయం 6 గంచల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి వెసులుబాటు కల్పించారు. ఐతే రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 1గంట వరకు లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. కాబట్టి ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, ఏమైనా పనులను చక్కబెట్టుకోవడనాకి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.

lock down

ఉదయం 6 నుంచి 1గంట వరకు మొత్తం 7 గంటల పాటు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు. అంతే కాకుండా ఒక గంట పాటు అంటే మద్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. కానీ 2 గంటల తరువాత మాత్రం లాక్ డౌన్ ను చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మద్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అనుమతి లేనివారు ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు , వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు.