డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోరీ, సంచలనం రేపుతున్న దొంగలు రాసిన లేఖ

Deputy Collector burglary at home in Madhya Pradesh - Suman TV

స్పెషల్ డెస్క్- ఓ ఇద్దరు ముగ్గురు దొంగలు ఓ ఇంట్లో దొంగతనానికి వస్తారు. కాస్త అమాయకులైన ఆ దొంగలకు ఆ ఇంట్లో దొంగిలించేందుకు ఏం దొరకవు. ఇంట్లో విలువైన వస్తువులు గాని, డబ్బులు గానీ ఉండవు. దీంతో దొంగలు ఇంట్లో ఉన్నవాళ్లపై కోప్పడతారు. ఇంతి పెద్ద ఇళ్లు కట్టుకుని, ఇంట్లో ఏంలేకపోతే మాలాంటి దొంగలు ఎలా బతకాలని సలదాగా కామెంట్ కూడా చేస్తారు. ఇలాంటి ఘటనలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం.

అదే నిజ జీవితంలో జరిగితే.. భలే ఉన్నారే.. రియల్ లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయా అని అనుకుంటున్నారు కదా.. ఐతే మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటనను చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. మధ్యప్రదేశ్ లో ఓ విచిత్రమైన దొంగతనం ఘటన జరిగింది. ఏకంగా ఓ డిప్యూటీ కలెక్టరు ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగలు ఇంట్లో డబ్బులు లేకపోవడంతో ఇంటి యజమానికి లేఖ రాసిన ఘటన ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ సమీపంలో దేవాస్ సివిల్ లైన్స్ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసంలో దొంగతనం జరిగింది.

Letter 1

చోరీ జరిగిన డిప్యూటీ కలెక్టరు ఇల్లు దేవాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ప్రదీప్ సోని, జిల్లా పోలీసు సూరింటెండెంట్ నివాసాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. ఖతేగావ్ తహసీల్‌ లో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న త్రిలోచన్ గౌర్ గత 20 రోజులుగా ఇంట్లో ఉండటం లేదు. పని నిమిత్తం ఆయన తన సొంత గ్రామానికి వెళ్లారు. ఊరి నుంచి వచ్చాక చూస్తే ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాటిన 30 వేల నగదు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో త్రిలోచన్ గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిని నిశింతగా పరిశీలించారు.

వారికి దొంగలకు సంబందించిన ఆనవాళ్లు ఏందొరకలేదు కానీ, ఇంట్లో ఓ లెటర్ మాత్రం దొరికింది. అది దోపిడి కోసం వచ్చిన దొంగలు రాసిన లేఖ. ‘‘ఇంట్లో డబ్బులు లేనట్లయితే, తాళం ఎందుకు వేశారు.. అని ఈ లేఖలో ఇంటి యజమాని డిప్యూటీ కలెక్టరును ప్రశ్నించారు. దొంగలు రాసిన ఈ లేఖను చూసి పోలీసులతో పాటు జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంట్లో ఏందొరక్కపోతే దొంగలకు మాత్రం కడుపు మండదా అని సరదాగా నవ్వుకుంటున్నారు.