మరదలిని ఎరగా వేసి, ఫ్రెండ్ నుంచి కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి

హైదరాబాద్ క్రైం ఈ కాలంలో డబ్బు సంపాదించేందుకు ఏంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు కొందరు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారు ఎదుటి వారిని దారణంగా మోసం చేస్తున్నారు. డబ్బు కోసం మానవత్వం మరిచి దిగజారిపోతున్నారు. చట్టాలు ఎంత పటిష్టం చేసినా, సమాజంలో మోసాలు మాత్రం ఆగడం లేదు. ఇలాగే ఓ కోటీశ్వరున్ని తెలివిగా మాయ చేసి కోట్ల రూపాయులు కొల్లగొట్టారు కొందరు.

హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన సుబ్బారెడ్డి భూస్వామి. వివిధ పనుల నిమిత్తం అతను తరచూ హైదరాబాద్‌కు వచ్చే వెళ్తుండేవాడు. ఈ క్రమంలో సుబ్బారెడ్డికి నగరంలోని అంబర్‌పేటకు చెందిన సాయిరాం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల సందర్బంగా సుబ్బారెడ్డికి కోట్లలో ఆస్తులున్నాయని అనిల్ తెలుసుకున్నాడు. ఎలాగైనా అతని దగ్గర డబ్బులు కాజేయాలని దురాలోచన చేశాడు అనిల్.

WhatsApp Image 2021 10 06 at 23.

అనుకున్నదే తడవుగా అందమైన తన మరదల్ని రంగంలోకి దింపాడు. బాగ్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో నివాసం ఉంటున్న తన మరదలు అర్చన అలియాస్‌ సంజనను సుబ్బారెడ్డికి ఎరగా వేశాడు. సుబ్బారెడ్డి గురించి, అతడి అలవాట్లు, బలహీనతల గురించి మరదలికి చెప్పాడు. సుబ్బారెడ్డిని అర్చన వాట్సాప్ లో పరిచయం చేసుకుంది. ప్రతి రోజూ చాటింగ్‌ చేస్తూ అతడికి వలపు వల విసిరి దగ్గరైంది. ఆ తరువాత పధకంలో భాగంగా తనకు కష్టాలున్నాయని చెప్పుకోవడం మొదలుపెట్టింది.

తనకు హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌ ఉందని, అది నష్టాల్లో ఉందని, ఆర్థిక సాయం చేయాలని కోరింది. నిజమే అనుకున్న సుబ్బారెడ్డి ఓ సారి డబ్బులు ఇచ్చాడు. అలా అమె అడుగుడూ పోతుండగా, విడతల వారీగా సుబ్బారెడ్డి నుంచి 1కోటీ 20 లక్షల రూపాయలు రాబట్టింది. కొన్నాళ్లు అయ్యాక అర్చన ప్రవర్తనపై అనుమానం వచ్చిన సుబ్బారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. అర్ఛనతో పాటు ఆమె బావ సాయిరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు.