వైరస్ లను పెంచుతున్న దేశాలు ఇవే! ఒక్కొకటి ఎంత ప్రమాదమో తెలుసా?

కరోనా వైరస్ మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ చైనా వైరస్ కారణంగా అందరి జీవితాలు తలక్రిందులు అయిపోతున్నాయి. కరోనా వైరస్ పుట్టింది చైనా వుహాన్ ల్యాబ్ లోనే అన్న వాదన మొదటి నుండి వినిపిస్తూనే ఉంది. కానీ.., ఇప్పటి వరకు ప్రపంచదేశాలు ఈ విషయాన్ని సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయాయి. కానీ.., చైనా గత కొన్ని దశాబ్దాల నుండి వైరస్ లతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. భవిష్యత్ లో బయో వార్ వస్తే.. అన్నీ విధాలా సిద్ధంగా ఉండాలి అన్నది చైనా ప్లాన్. మరి.. ఇలాంటి స్థితిలో కరోనా వైరస్ పుట్టకకి, చైనాకి సంబంధం లేదని చెప్పడం కష్టం. కానీ.., మీకు తెలుసా? ఒక్క చైనా మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు తమ ల్యాబ్స్ లో వైరస్ లని పెంచి పోషిస్తున్నాయి. ఈ విషయంలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది అమెరికా గురించే. అమెరికాలో లెవల్ 4 ల్యాబులు… 15 దాకా ఉన్నాయి. అక్కడ రకరకాల ప్రాణాంతమైన వైరస్లు, పాతోజెన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందుకోసం 60 మంది శాస్త్రవేత్తలు, 18 మంది పరిసోధకులు, 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కేవలం బయోవార్ ని దృష్టిలో పెట్టుకునే అమెరికా శాస్త్రవేత్తలు ఇలా రకరకాల వైరస్ లతో ప్రయోగాలు చేస్తన్నారు.

virsu 2ఇక ఈ లిస్ట్ లో తరువాతి స్థానం రష్యాది. రష్యాలో స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ ల్యాబ్ ఉంది. అక్కడ కంటిన్యూగా వైరస్లు, బ్యాక్టీరియా… వాటి ద్వారా వచ్చే వ్యాధులపై పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ల్యాబ్ లో ఓ పరిశోధకుడు 2004లో స్వయంగా ఎబోలా వైరస్ను ఎక్కించుకొని… 2 వారాల తర్వాత చనిపోయాడు. ఇక 2019 లో కూడా ఈ ల్యాబ్ లో ఓ ప్రమాదం జరిగింది. చాలా మందికి గాయాలు అయ్యాయి. కానీ.., ఆ సమయంలో ఎలాంటి వైరస్ బయటకి రాలేదు. ఒక్క అమెరికా, రష్యాలో మాత్రమే కాదు.., మొత్తం 16 దేశాలు ఇలాంటి వైరస్ లతో ప్రయోగాలు చేస్తున్నాయి. కెనడా, క్యూబా, ఫ్రాన్స్ , జర్మనీ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జపాన్, లిబియా, నార్త్ కొరియా, సౌత్ ఆఫ్రికా, సిరియా, యూకే వంటి మొదలైన దేశాలలో కరోనా లాంటి, లేదా అంతకన్నా ప్రమాదకరమైన వైరస్ లతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి కనుక ఒక్కసారి ఆ ల్యాబ్స్ నుండి బయటకి వస్తే.. మానవాళి మనుగడ దదాపు అసాధ్యం. మరి చూశారు కదా? ఇలా వైరస్ లతో ప్రయోగాలు చేసే దేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.