వైద్య శాస్త్రంలో అద్భుతం.. మనిషికి పంది గుండె

Pig Heart Using for Men

మనిషికి పంది గుండెను అమర్చి వైద్యశాస్త్రంలో చారిత్రక ఘట్టానికి తెరతీశారు అమెరికన్‌ వైద్యులు సర్జన్ బార్ట్లీ, గ్రిఫిత్ నేతృత్వంలోని వైద్యబృందం. బాల్టిమోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను విజయవంతంగా 57 సంవత్సరాల డేవిడ్‌ బెన్నెట్‌కు అమర్చి ఆయన ప్రాణాన్ని కాపాడారు.

సకాలంలో అవయవాలు దొరక్క అవస్థలు పడుతున్నవారికి ఇది ఒక శుభవార్తగానే చెప్పవచ్చు. సంప్రదాయ గుండె మార్పిడికి పేషెంట్‌ పరిస్థితి అనుకూలించకపోయే సరికి జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను అమర్చారు. ఇందుకోసం అమెరికన్ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం బెన్నెట్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాకపోతే ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెబుతున్నారు. విడ్‌ బెన్నెట్‌ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటే మాత్రం మనిషి సాధించిన అద్భుతమైన విజయాలలో ఇదొకటిగా చరిత్రలో నిలిచిపోతుంది.