సముద్రంలో భారీగా ఆయుధాలు! పాకిస్థాన్ పనేనా?

ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద చర్యలు మళ్ళీ ఎక్కువ ఆయాయ్యి. ఈ నేపథ్యంలో తీవ్రవాద కార్యక్రమాలు రోజులో ఎక్కడో ఓ దగ్గర బయట పడుతూనే వస్తున్నాయి. తాజాగా ఉత్తర అరేబియా సముద్రంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్‌- ఒమన్‌ దేశాల మధ్య ఉత్తర అరేబియా సముద్రంలో భారీ ఆయుధాలను కలిగి ఉన్న ఓ నౌకని అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకొంది. తీవ్రవాదుల కోసం ఈ ఆయుధాలు తీసుకుని వెళ్తున్నట్టు ప్రాధమికంగా భావించారు. అయితే.., సరిగ్గా పాక్‌కు సమీపంలో.. ఆ దేశ సముద్ర జలాల్లోనే పట్టుకొవడంతో వీటిని యెమెన్‌లో పోరాటం చేస్తున్న హౌతీ తీవ్రవాదుల కోసం తీసుకెళ్తున్నట్టు తేలింది. ఈ నౌక ఇరాన్‌ నుంచి బయలుదేరినట్టు అమెరికా నిఘా వర్గాలు తేల్చాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 3000 చైనా తరహా కె-56 రైఫిళ్లు, రష్యాలో తయారైన ట్యాంకులపై దాడులు చేసే గైడెడ్‌ మిసైళ్లు, వందలాది భారీ తరహా మిషన్‌ గన్లు, రాకెట్‌ ఆధారిత గ్రెనేడ్‌ లాంఛర్లు, స్నైపర్‌ రైఫిల్స్, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రి ఉంది. మధ్యప్రాచ్యంలో భద్రత వ్యవహారాలు చూసే అమెరికా ఫిఫ్త్‌ ఫ్లీట్‌కు చెందిన ‘యూఎస్‌ఎస్‌ మాంటేరీ’ నౌక సాయంతో వీటిని పట్టుకున్నారు. యెమెన్‌లో ప్రభుత్వ దళాలు, హౌతీ ఉగ్రవాదుల మధ్య 2014 నుంచి పోరాటం జరుగుతోంది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు సుమారు ఒకటిన్నర లక్షల మంది ప్రాణాలను కోల్పోవడం బాధాకరమైన విషయం. అయితే.., యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులకు పాకిస్థాన్ సపోర్ట్ ఉందని చాలా రోజుల నుండి మిగతా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ నౌక కూడా పాకిస్థాన్ కి తెలిసే తమ సముద్ర జలాల ద్వారా యెమెన్‌ కి చేరుకోబోయిందా అన్న దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఒకవేళ ఈ విషయంలో కనుక పాక్ దోషిగా తేలితే అంతర్జాతీయంగా ఆ దేశానికి కష్టాలు తప్పకపోవచ్చు. మరి రానున్న కాలంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.