సిరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆత్మహుతి దాడిలో ముగ్గురు మృతి

bomb blast

సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సిరియా ప్రెసిడెంట్ అసద్ భవనం ఎదుట ఉగ్రవాది ఆత్మహుతి దాడికి చేసుకుని క్రమంలో  పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఉగ్రవాదితో పాటు ముగ్గురు పోలీసుల అధికారులు మరణించారు. ఈ ఆత్మాహుతి దాడిలో వారి శరీర భాగాలు తునకలుగా మారి చెల్లాచెదురుగా పడ్డాయి.

ఇక మొదట్లో సిరియా అధ్యక్ష భవనం ఎదుట బాంబ్ తో అనుమానంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బాంబ్ పేలింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయాయి. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అధ్యక్ష భవనం ఎదుట భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.