బ్రేకింగ్ : ‘పంజ్​షేర్’​ తాలిబన్ల వశం!

ఆఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు గత కొంత కాలంగా కొరకరాని కొయ్యగా ‘పంజషేర్’ నుంచి తిరుగుబాటు మొదలైంది. కాబూల్ ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్ పూర్తిగా ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇక్కడే వాళ్లకు అనూహ్యరీతిలో షాక్ తగిలింది. పంజ్ షేర్ నుంచి తాలిబన్లకు పూర్తి వ్యతిరేకత ఎదురైంది. నాటి నుంచి ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే.

taliban1 compressedవిజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడుతోంది. తమ మాతృభూమిని తాలిబన్లకు దక్కనిచ్చేది లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. తాలిబన్లు ఆప్ఘన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పంజ్ షేర్ ని ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నం సాగించారు తాలిబన్లు. మరోవైపు పంజ్ షీర్ నేత అమ్రుల్లా సాలేహ్ తాజాగా తాలిబన్ సహా ఉగ్రవాదులపై పోరాటానికి తమ సైన్యానికి మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కానీ తాలిబన్లు మాత్రం షంజ్ షేర్ తమ కైవశం చేసుకునే ప్రయత్నం కొనసాగించారు.

taliban compressed 1మొత్తానికి ఆఫ్ఘానిస్థాన్​లోని పంజ్​షేర్​ లోయను తాము హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. అహ్మ‌ద్ మ‌సూద్ మేన‌ల్లుడు అబ్దుల్ తో పాటు ప‌లువురు ముఖ్య‌నేత‌లు మృతి చెందార‌ని ప్ర‌క‌టించారు. సహేల్ కమాండ్ ని కాల్చి వేశామని.. ఇల్లు కూల్చి వేశామని తాలిబన్లు ప్రకటించారు.  ఆఫ్ఘన్ లో తెల్లజెండ ఎగిరింది. తాలిబన్లు తమ పంతం నెగ్గించుకున్నారు. ఇదిలా ఉంటే.. తాలిబ‌న్ల దాడి నేప‌థ్యంలో ప్రతిఘటన బృందం నాయ‌కుడు, ఆఫ్ఘ‌నిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ వేరే సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆఫ్ఘ‌నిస్థాన్​లో ఇన్నాళ్లు.. తాలిబన్ల వశం కాని ఏకైక ప్రాంతం కూడా వారి అధీనంలోకి వెళ్లిపోయింది.