సతీమణి పుట్టినరోజును మరచితే కారాగారంలో పడేస్తారు!

wife bday

ప్రపంచం అనేది అనేక దేశాల సమాహారం. అనేక భాషల, వ్యహారాల,కట్టుబాటుల, సాంప్రదాయాల మిళితమే ఈ ప్రపంచం. అయితే ప్రతి దేశానికి ఓ భాష ఉంటుంది. దేశానికో భాష ఉన్నట్లే చట్టాలు కూడా ఉంటాయి. వివిధ దేశాల్లో వివిధ రకాల భాషలు, చట్టాలు ఉంటాయి. కొన్ని దేశాల్లోని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ నేరం చేస్తే పడే శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి.

ఇది నాణెంకి ఒక వైపు మాత్రమే మరొక వైపు కొన్ని దేశాల్లో నేరాలకు కాస్త వెసులుబాటును కల్పిస్తుంటాయి. ఇదంత చెప్పటానికి ఓ కారణం ఉంది. అందేమిటంటే ఎవరైన తమ భార్య పుట్టిన రోజును మర్చిపోతే జైలుకు పంపిస్తారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ వింత చట్టం ఎక్కడ అమలవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పసిఫిక్ సముద్రం సమీపంలో సమోవా అనే ఓ ద్వీపం ఉంది. ఆ ఐలాండ్ ఎంత అందంగా ఉంటుందో అక్కడి ఉండే చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని నేరాలకు శిక్షలు మనకు కామెడీగా అనిపిస్తాయి. అక్కడ భర్తలు తమ భార్య పుట్టిన రోజును మర్చిపోతే జైలు శిక్ష అనుభవించాలని అక్కడి ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. సతీమణి పుట్టినరోజును పొరపాటున మర్చిపోతే కూడా అక్కడ నేరంగా పరిగణిస్తారట. అయితే భార్య ఫిర్యాదు చేస్తేనే సదరు వ్యక్తి పై కేసు నమోదు చేస్తారు. ఒకవేళ ఆమె ఫిర్యాదు చేస్తే పోలీసులు మొదట సారి హెచ్చరించి వదిలేస్తారు. అదే మళ్లీ పునరావృతం అయితే ఇంక ఆ భర్త జైలుకే . భార్యపై నిర్లక్ష్యం చూపకూడదనే ఉద్దేశ్యంతో సమోవా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

wife bday2 compressedమరికొన్ని వింత శిక్షలు..

ఇటీవల చైనా కూడా పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించాలని ఓ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ముస్సోరీలో డేవిడ్ బేరీ అనే వ్యక్తి జింకలను వేటాడిన కేసులో ఒక ఏడాది వరకూ జైల్లో ఉండి నెలలో కనీసం ఒకసారి డిస్నీ బాంబీ కార్టూన్ చూడాలని శిక్ష వేశారు. స్పెయిన్లో ఎండాలుసియాలోని అమ్మనాన్నలు పాకెట్ మనీ ఇవ్వడం ఆపేశారని ఒక యువకుడు కోర్టుకు వెళ్లాడు.

ఒక ఫ్యామిలీ కోర్టు అతడికే 30 రోజులోగా అమ్మనాన్నలతో ఉంటున్న ఇల్లు వదిలి వెళ్లిపోవాలని, తన కాళ్లపై తాను నిలబడడం నేర్చుకోవాలని తీర్పు ఇచ్చింది. ఇలాంటి వింత శిక్షలు అనేకం ఉంటుంటాయి. భార్య పుట్టిన మర్చిపోతే భర్తను జైలుకు పంపించే విధానం పై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.