వారెవ్వా.. కొరియన్ అమ్మాయి నోటా సారంగదరియా పాట…

లెజెండరీ సింగర్, దివంత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగువారితో పాటు దేశం గర్వించదగ్గ గొప్ప నేపథ్య గాయకుడు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఎక్కడో అక్కడ ఆయన పాటలు వింటూనే ఉంటాం. తెలుగులోనే కాదు విభిన్న భాషల్లో ఆయన గానంతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. ఈ మద్యనే ఓ అరబ్ షేక్.. బాలు పాటను పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.

saraga minకె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ చిత్రానికి కె.వి.మహదేవన్‌ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అందించిన సంగీతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఈ సినిమాలో బాలు పాడిన ‘విధాత తలపున..’పాట ఎందరికో ఆల్ టైం ఫేవరైట్ సాంగ్. ఈ నేపథ్యంలోనే బాలుగారిపై అభిమానంతో తాజాగా దుబాయ్ కు చెందిన ఓ షేక్‌ ఆ పాటను ఆలపించారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక తెలంగాణ జానపదం సారంగదరియా పాట యూట్యూబ్‏లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ మూవీలోని సాంగ్ సారంగదరియా.

koriya minదాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగదరియా అంటూ సాగే ఈ పాట మంగ్లీ పాడగా.. సాయి పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. తాజాగా సారంగదరియా పాటను ఓ కొరియన్ అమ్మాయి అద్భుతంగా ఆలపించింది. తెలంగాణ జానపదాన్ని అవలిలగా పాడిన ఆ అమ్మాయిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ కొరియన్ యువతి తాను ఆలపించిన వీడియోను యూట్యూబ్‏లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 8.93 లక్షల మందికి పైగా వీక్షించారు. కాకపోతే ఆ అమ్మాయి వివరాలు మాత్రం వెల్లడించలేదు.. తన యూట్యూబ్ ఛానల్లో మాత్రం కొరియన్ జీ1 అని పేర్కోంది.