అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు చిన్నారులు మృతి!

ప్రపంచాన్ని ఓ వైపు కరోనా రక్కసి కబలిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కుదేలు చేసింది. లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంబవించాయి. అమెరికా లాంటి అగ్ర రాజ్యమే కరోనా ధాటికి తట్టుకోలేక పోయింది. ఇది చాలదు అన్నట్టు అక్కడ సైక్లోన్ ప్రభావం కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఆ మద్య అమెరికాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ప్రస్తుతం అక్కడ వేలల్లో కేసులు మళ్లీ మొదలయ్యాయి.

gun compressed

ఇది చాలదు అన్నట్టు అమెరికాను పట్టి పీడిస్తున్న మరో సమస్య గన్ కల్చర్. ఇక్కడ మైనర్లు కూడా గన్స్ వాడుతుంటారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న గన్ కల్చర్ కి ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపాయి.వాషింగ్ట‌న్‌, ఫ్లోరిడా, హ్యూస్ట‌న్ సిటిలో కాల్పులు జ‌రిగాయి. ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఓ సైకో తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నట్లు సమాచారం.

కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రయాన్‌ రిలేగా గుర్తించారు. అతడు యూఎస్‌ మెరైన్‌లో పనిచేశాడని, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. హ్యూస్ట‌న్ లో న‌లుగురు మృతి చెందారు. వాషింగ్ట‌న్‌లో ముగ్గురు మృతి చెందారు. సైకోల చేతిలో గన్ ఎలాంటి పరిణామాలకైనా దారి తీయవొచ్చని.. గత కొంత కాలంగా అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుందని.. ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో అక్కడ ఈ దారుణాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా క‌రోనా కాలంలో ఈ గ‌న్ క‌ల్చ‌ర్ మ‌రింత‌గా పెరిగింది. నిరుద్యోగం, భ‌ద్ర‌తాలోపం, మాన‌సిక ఒత్తిళ్ల కారణంగా ఇలా కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని అధికారులు చెబుతున్నారు.