పాకిస్థాన్ ప్రధానితో రేఖ పెళ్లి.. పీటల వరకు వచ్చి ఎందుకు ఆగింది

రీసెర్చ్ డెస్క్- రేఖ.. ఈపేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని.. 1980 ఆ ప్రాంతంలో రేఖ హవా అంతా ఇంతా కాదు. తన అందం, అభినయంతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది రేఖ. రేఖ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అప్పుట్లో అంతా ఎదురుచూసే వారంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదో ఉహించవచ్చు. రేఖ నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ డూపర్ హిట్టే. మరి అంత క్రేజ్, అంతకంటే ఎక్కువ అందం ఉన్న రేఖ ప్రేమలో పడలేదా అంటే.. పడిందనే చెప్పాలి. ఒక్కరితో కాదు తాలా మందితో రేఖ ప్రేమలో పడితే.. ఇక రేఖను ప్రేమించిన వాళ్లు లక్షల్లో ఉండేవారంటే అతియోశక్తి కాదు.

rekha
Imran Khan and rekha

బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్‌తో రేఖ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. కానీ ఎందుకో మరి అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రేఖ ప్రేమించుకున్నారని చాలా కొంత మందికి మాత్రమే తెలుసట. రేఖ కోసం ప్రత్యేకంగా పాకిస్థాన్ నుంచి ముంబై వచ్చేవాడట ఇమ్రాన్. ముంబై బీచ్ లో వీళ్లిద్దరు ఎన్నో సాయంత్రాలు సరదాగా గడిపారని బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. ఇమ్రాన్ తో తన కూచురి వ్యవహారం రేఖ తల్లి పుష్పవల్లికి కూడా తెలుసని, వీరిద్దరి పెళ్లికి ఆమె కూడా ఓకే చెప్పారని అప్పట్లో టాక్.

imran rekha
Rekha and imran news

ఇంకేముంది రేఖ, ఇమ్రాన్ పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ వీరిద్దరి మధ్య ఏంజరిగిందో తెలియదు కాని.. హఠాత్తుగా 1990లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది రేఖ. ఆ తరువాత రేఖ లండన్ కు వెళ్లిపోయింది. మరి ఏమైందో తెలియదు కాని రేఖ ముఖేష్ భర్త అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన రేఖ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అమితాబ్ కు అప్పటికే జయను పెళ్లి చేసుకున్నా.. మళ్లీ రేఖను రెండో పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు.