‘యాంటీ-సెక్స్’ కార్డు బోర్డు బెడ్స్ పై ఐర్లండ్ ఆటగాడు కామెడీ!..

టోక్యో ఒలంపిక్స్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో క్రీడాకారులు సెక్స్ లో మునిగి తేలకుండా ఉండేందుకు నిర్వాహకులు గడసరి చర్యలు చేపట్టారు. సెక్స్ పై ఆసక్తి పెరిగితే ఆటపై దృష్టిపెట్టలేరనే ఉద్దేశంతో వినూత్న చర్యలు చేపట్టడం గమనార్హం. కరోనా మహమ్మారి కూడా పొంచిf ఉండటంతో క్రీడాకారులు ఒకరితో మరొకరు కవలకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండేందుకు తక్కువ సామర్థ్యం ఉన్న మంచాలను సిద్ధం చేశారు.

Anti Sex Beds minక్రీడాకారులు ఒకరిని ఒకరు కలవకుండా ఉండేందుకు సెక్సు చేసేందుకు వెసులుబాటు కల్పించ కుండా ఉండేలా ఒలింపిక్ నిర్వాహకులు పక్కా ప్లాన్ వేశారు.  తక్కువ సామర్థ్యం ఉన్న మంచాల్ని సిద్ధం చేశారు. పడక సుఖం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే వారి మంచాలు వాటిని మోసే సామర్థ్యం ఉండని రీతిలో వాటిని రెఢీ చేయటం ఆసక్తికరంగా మారింది.ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన బెడ్లు కూడా ‘యాంటీ-సెక్స్’ అయి చెబుతున్నారు. కార్డు బోర్డుతో తయారైన ఈ బెడ్లు కేవలం 200 కేజీల బరువును మాత్రమే మోస్తాయంటా.  ఎవరైనా ఆ కార్డ్‌బోర్డ్ బెడ్లపై ఎగిరినా విరిగిపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

వేరే వారితో కలిసి పడక సుఖాన్ని పంచుకోవాలంటే మంచం కిర్రుమనటం తర్వాత ముందుగా కూలిపోతుందని చెబుతున్నారు. క్రీడాకారుల మధ్య అవసరమైన భౌతిక దూరానికి తగ్గించేందుకు ఈ విధమైన ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.  కార్డ్ బోర్డ్ లతో చేసిన మంచాలైనప్పటికీ దృఢంగా ఉన్నాయంటూ ఐర్లండ్ కు చెందిన జిమ్రాస్టిక్స్ ఆటగాడు రిస్ మెక్ క్లెనఘన్ తన ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అట్టలతో చేసినప్పటికీ అవి దృఢంగానే ఉంటాయని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ నిర్వాహకులు రిస్ కు ధన్యవాదాలు తెలిపారు.

శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారంటూ అమెరికాకు చెందిన ఓ ఆటగాడు ట్వీట్ చేయడంతో ‘యాంటీ సెక్స్ బెడ్స్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.  ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించి దీనిపై స్పష్టతనిచ్చారు. అయితే మరో క్రీడాకారుడు ఈ మంచాల్ని దృఢంగా ఉన్నాయని చెప్పడం మరో మలుపు – కొసమెరుపు!..

ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో షేర్ చెయ్యండి.