ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన! పాపం ఈ డ్రైవర్!

bus in water

మనిషి ఎంత శక్తివంతుడైనా, టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా, ప్రకృతి ముందు చిన్నవాడే. అంతా మాములుగా ఉంటే అమ్మలా ఆదరించే ప్రకృతి.., ఉగ్రరూపం దాలిస్తే మాత్రం ముంచేస్తుంది.ఇక ప్రస్తుతం వివిధ దేశాల్లో భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎటు చూసిన వరదలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విపత్తుకి రష్యా వేదిక అయ్యింది.

ప్రస్తుతం తూర్పు రష్యాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ వరదల కారణంగాణ చాలా భవనాలు కూలిపోయాయి..చెట్లు విరిగిపోయాయి. ప్రాణ నష్టం భారీగా సంభవించింది. ఈ క్రమంలోనే తూర్పు రష్యాలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

bus floated in bridgeతూర్పు రష్యాలో విశాలమైన పచ్చిక బయళ్లు ఎక్కువ. ఇదే సమయంలో అక్కడ నదులు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ.., జనావాసం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో నదులు ఉంటే అక్కడ చెక్క వంతెనలు మాత్రమే ఏర్పాటు చేసి ఉంటారు. ఇవి చాలా దృడంగా ఉంటాయి. భారీ వాహనాలు సైతం ఈ వంతెనలపై నుండి వెళ్తుంటాయి. అయితే.., భారీ వర్షాల కారణంగా ఓ వంతెన అప్పటికే చాలా వరకు తెగిపోయింది. కానీ.., ఇది గుర్తించని ఓ లారీ డ్రైవర్ వాహనాన్ని వంతెన పైకి పంపించాడు.

కొంత దూరం వెళ్ళాక.., ఆ వంతెన ఊగడం ప్రారంభించింది. అప్పటికే డ్రైవర్ కు అనుమానం వచ్చింది. అంతలో ఒక్కసారిగా ఆ చెక్క వంతెన పూర్తిగా కూలిపోయింది. దీంతో లారీతో సహా డ్రైవర్ నదిలో పడిపోయాడు. అయితే.., డ్రైవర్ కొంచెం ధైర్యం చేసి నదిలో ఈదుకుంటూ బయటపడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు రికార్డ్ చేసి.., ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో.., ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంత పెద్ద ప్రమాదం నుండి కూడా దైర్యంగా బయటపడ్డ ఆ డ్రైవర్.. ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. మరి.. మీరు కూడా ఆ వైరల్ వీడియోపై ఓ లుక్ వేయండి.