మైకల్ జోసెఫ్ జాక్సన్..ఒకనాటి రోజుల్లో సంగీత ప్రపంచాన్ని ఏలిన ఓ పాప్ సింగర్. తన పాటలంటే యావత్ ప్రపంచం ఓ రేంజ్లో ఇష్టపడేది. ఆయన పాటలతో ఎనలేని అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ ఇప్పటికి చెక్కుచెదరకుండా మోగుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులకు సొంతం చేసుకున్న ఆయన 2009 మరణించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువతి మైఖేల్ జాక్సన్ ఆత్మ నన్ను పెళ్లి చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. యూకేకు చెందిన కాథ్లీన్ రాబర్ట్స్ అనే ఓ మహిళ మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత ఆయన ఆత్మ తిరిగి వచ్చిందని తెలిపింది. తిరిగి రావటమే కాకుండా మార్లిన్ మన్రో అనే మైఖేల్ జాక్సన్ ఆత్మ నాతో గడిపిందని తెలిపింది. ఇక నాలో ఉండే ఆయన ఆత్మ శృంగారం తప్పా అన్ని పనులు చేస్తుందంటూ ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేస్తోంది. ఇక ఈ వార్త విన్న ప్రతీ ఒక్కరు మైఖేల్ జాక్సన్ ఆత్మ పెళ్లి చేసుకోవటం ఏంటని నోరెళ్లబెడుతున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.