డెలివరీ బాయ్స్ కావాలని డోమినోస్ పిజ్జా ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అయితే ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూలో ఆమె వయసు ఎంత అని అడిగారు. ఆ తర్వాత ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. ఆమె వయసు కారణంగా ఆమెను రిజెక్ట్ చేశారని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 18 నుండి 30 ఏళ్ళ లోపు వయసున్న మగవారిని మాత్రమే తీసుకుంటారని తెలియడంతో ఆమె లింగ వివక్షకు గురైనట్లు గురైన విషయాన్ని డోమినోస్ స్టోర్ వారికి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు. దీనికి డోమినోస్ స్టోర్ వారు స్పందించి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో క్షమాపణలు చెప్పించారు. అయితే కంపెనీ పిజ్జా డెలివరీ బాయ్స్ కోసం జాబ్స్ ప్రకటన ఇస్తూనే ఉండడంతో.. వాల్ష్ మరింత దిగులు చెందారు. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళ అయిన కారణంగా ఈ ఉద్యోగం ఇవ్వడం లేదని ఆమె కోర్టు మెట్లెక్కారు. ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమిషన్ మద్ధతుగా నిలిచింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడంతో పాటు సమానత్వాన్ని పాటించాలని, అలా పాటించనప్పుడు ఉద్యోగుల హక్కులు ఎలా రక్షంపబడతాయని డోమినోస్ కంపెనీని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు వాల్ష్కు డోమినోస్ కంపెనీ రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. అందుకే అనేది అమ్మాయిల వయసు, మగాళ్ళ జీతం అడగకూడదు అని. మరి జాబ్ కోసం వెళ్ళిన ఈ మహిళ ఏకంగా బిజినెస్ పెట్టుకునేందుకు పెట్టుబడి డబ్బులు సంపాదించుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: వీడియో : మాస్ లూటీ అంటే ఇదే.. షాప్ అంతా క్షణాల్లో మాయం చేశారు..!