ఇండియన్‌ ఆర్మీ అంటే ఏంటో చూసించే వీడియో.. చైనా బార్డర్‌లో డ్రీల్‌

సరిహద్దు వద్ద చైనాతో మన దేశానికి ఘర్షణలు తలెత్తి యుద్ధ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా వరకు మన సైన్యం చైనా సైనికులను నియంత్రించారు. ఈ క్రమంలో చైనాతో యుద్ధం వస్తే ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపేందుకు భారత సైన్యం ఒక డ్రీల్‌ను నిర్వహించింది. అలాగే సైనికులకు దీనిపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు సమాచారం.

Indian Army soldiers undergo aggressive training - Suman TVకాగా ఈ యుద్ధ విన్యాసాలు చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. భూమిలోంచి బయటికి వచ్చి శత్రువును మట్టుబెట్టే సైనికుడు. అతని వేషాధారణ భయంకరంగా ఉంది. యుద్ధ సమయాల్లో ఇండియన్‌ ఆర్మీ జరిపే చర్యలను డ్రీల్‌ రూపంలో చైనా సరిహద్దుల వద్ద చేపట్టారు. అందులో సైనికులు మెరుపు వేగంతో దాడులు చేసే దృశ్యాలు ఉన్నాయి. శత్రు దేశ యుద్ధ ట్యాంక్‌లను ఎలా మట్టుబెట్టేలో సైనికులకు ఈ డ్రీల్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ డ్రీల్‌తో ఇండియన్‌ ఆర్మీ పవర్‌ ఏంటో తెలుస్తుంది. అలాగే సైనికులకు కఠిన పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి.