పెళ్లైయిన కొద్ది గంటలకే విడాకులిచ్చేసిన వరుడు.. ఎందుకంటే..

రెండు మనసులను ఒకటిగా కలిపి వేడుక పెళ్లి. అలాంటి పెళ్లి వేడుకలో వరుడు, వధువు కుటుంబాలు సందడిగా ఉంటాయి. ఇదే సమయంలో తమ వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేసి అందరిలో హుషారు పెంచుతారు కొందరు పెళ్లి కూతుర్లు. అలా తన పెళ్లి వేడుకల్లో ఓ వధువు ఉత్సాహంగా ఓ పాటకు డ్యాన్స్ చేసింది. అంతే వరుడు కోపంతో ఊగిపోయి.. వెంటనే విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఇరాక్లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లో ఓ వ్యక్తి తన పెళ్లిని ఘనంగా చేసుకున్నాడు. అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లికి చాలా మంది అతిథులు వచ్చి.. ఆటపాటలతో చిందులు వేశారు. పెళ్లికూతురు కూడా ఓ సిరియన్ పాటకు డ్యాన్స్ వేసింది. అయితే ఆ పాట తమను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ వరుడు.. వధువుతో గొడవకు దిగాడు. ఇరువురు కుటుంబ సభ్యుల మధ్యకూడా వాగ్వాదం తారా స్థాయిలో జరిగింది. దీంతో ఆ క్షణంలోనే వరుడు వధువుకు విడాకులు ఇచ్చేశాడు. దాంతో దాంతో అక్కడ ఈ విషయం చర్చానీయాంశం అయింది.

కాగా ఆ దేశంలో అత్యంత వేగవంతమైన విడాకుల కేసు ఇదేనని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే పాటల కారణంగా విడాకులు తీసుకోవడం ఇక్కడ ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. లెబనాన్లో కూడా ఓ పాట కారణంగా కోపగించుకున్న వరుడు తన భార్యను వదిలేశాడు. ఓ వ్యక్తి తన పెళ్లి వేడుకల సందర్భంగా ఇదే పాటను ప్లే చేయడంతో తన భార్యతో విడిపోయాడు.ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.