అంగారక గ్రహం మట్టిలో పండిన టమాటాలు! వాటితో కెచప్‌ తయారు చేసిన కంపెనీ

Tomato Ketchup

భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై జీవించేందుకు మానవుడు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రుడు, అంగారక గ్రహాలపై బతికేందుకు అవకాశాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో ఒక కొంత అధ్యయం చోటు చేసుకుంది. అంగారక గ్రహం మట్టిలో టమాటాలు పండాయి. దీంతో అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కెచప్ తయారీలో సరికొత్త వెర్షన్‏ను సిద్ధం చేసింది. ఈ కెచప్‌ను అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేశారు.

మార్స్ మట్టిని మార్టిన్ రెగిలిత్ అంటారు. అంగారక గ్రహం మట్టిలో సేంద్రియ పదార్థాల ఉనికి లేదు. సూర్యకాంతి కూడా అంగారకుడిపై తక్కువగా పడుతుంది. అక్కడ టమోటాలను పండించేందుకు హీంజ్‌ కొత్త పద్దతులను కనుగొంది. ఇందుకోసం హీంజ్‌ కంపెనీలోని బృందం.. మార్స్ వంటి గ్రీన్ హౌస్ వాతావరణాన్ని సృష్టించింది. అందులో మార్స్ మట్టిని ఉపయోగించింది. చివరకు అందులో టమోటాలను పండించి వాటిని కచప్‏గా మార్చింది. ఈ కెచప్‌ రుచి సాధారణ వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుందట.

Tomato Ketchupహీంజ్‌ మార్స్ వెర్షన్ కెచప్‌ బాటిళ్లను అంతరిక్షంలోకి పంపి మైనస్‌ 94 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచారు. ఆ తర్వాత దాన్ని తిరిగి భూమి పైకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లే సందర్శకులు అక్కడి మట్టిలో టమోటాలు పండించగలరో లేదో, పండించినా వాటితో కెచప్‌ తయారు చేయగలరో లేరో తెలుసుకోవడానికే ఈ మిషన్‌ను ప్రారంభించినట్టు హీంజ్‌లోని టమోటా మాస్టర్స్ పేర్కొన్నారు.