‘కోవిషీల్డ్’ వాక్సినేషన్ వేసుకున్న వరుడు కావలెను!

సాధారణంగా మనం అమ్మాయి కి కానీ అబ్బాయి కి గాని పెళ్లి చేయాలనుకుంటే అది ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తెలుసుకొని మరీ ఇవ్వాలి అని అంటారు. అంతేకాకుండా వాటితో పాటు చదువుకున్న వార లేదా పొలం పనులు చేసుకునే వారు, అందం గా ఉన్నారా లేదా, ప్రాంతము,కులము ఇలా అన్నింటినీ ఒకటికి రెండు సార్లు వివరాలు తెలుసుకొని పెళ్లిళ్లు చేస్తారు. కరోనా పరిస్థితులతో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. వాక్సినేషన్, మాస్క్ ఇలాంటి వాటికి ఇప్పుడిప్పుడు పూర్తిస్థాయిలో అలవాటు పడుతున్నాం. ఈ తరహా సమయంలో ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. తామూ సైతం కరోనా ప్రపంచంలో విభిన్న ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో పత్రికలలో వచ్చే ప్రకటనలు కొన్ని వింత వింత గా ఉంటున్నాయి.  ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

covishield

తాజాగా ఒక వధువు తనని పెళ్లి చేసుకోబోయే వారికి వరుడికి ఒక షరతు పెట్టింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎత్తు, కలర్, విద్యార్హతలు, ప్రాంతం, కులం వివరాలు ఇస్తారు. కాని పెండ్లి ప్రకటనలో వింత షరతు విధించడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. తనను పెళ్లి చేసుకునేవాడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని వధువు స్పష్టం చేసింది. అది కూడా రెండు డోసులు వేసుకున వరుడే అర్హుడు అని ప్రకటించడాన్ని చూసి ‘హా’శ్చర్యపోతున్నారు. అన్ని అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని వధువు తన వాట్సప్ నెంబర్ కూడా ఇచ్చేసింది.  కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇలాంటి షరతులు ఉంటాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎం.పీ  శశిధరూర్  ఈ విషయాన్ని ట్వీట్ చేయడంతో ఆ ప్రకటన మరింత వైరల్ అయ్యింది.